Asianet News TeluguAsianet News Telugu

రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు... కొండా సీక్వెల్ ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్లు

ఎవరిమీదైనా సెటైర్ వేయాలన్నా.. కౌంటర్ వేయాలన్నా అది రామ్ గోపాల్ వర్మకే సాధ్యం... వర్మతో వాదనకి, ఆయన మీద సెటైర్లు వేయడానికి ఎంత వారైనా సరే ఆలోచిస్తారు. అటువంటిది.. వరుసగా వర్మపై సెటైర్లు పేలుతున్నాయి. దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.. ఎందుకంటారు...?

Ram Gopal Varma konda movie trolling on Social Media
Author
Hyderabad, First Published Jun 28, 2022, 12:31 PM IST

రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు వినగానే అందరికి గుర్తుకు వచ్చేది వివాదాలు. కొంత మంది అయితే వర్మను వివాదాల వర్మ అని కూడా పిలుస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈయన తీసే సినిమాలు అని అలానే ఉంటున్నాయి. వర్మ ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే పెద్ద పేరు సంపాదించాడు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ పేరు వివాదంగా మారిపోయింది.  మనిషి వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.  అయితే కొంత మంది వర్మ ధైర్యాన్ని మెంచ్చుకుంటే.. మరి కొందరు పిచ్చి అంటారు. 

దాదాపు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు పాలిటిక్స్ కు సంబంధించిన సెలబ్రిటీస్ లో తనకు నచ్చని వారందరిని కదిలించి కాంట్రవర్సీ చశాడు వర్మ. ఇంకా చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే  వర్మ ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన.. అలాగే ఎన్టీఆర్ పైన సినిమాలు తీసి సెన్సేషన్  క్రియేట్ చేసాడు. కానీ అవి సక్సెస్ కాలేదు.

ఇక ఇదే రాజకీయ నాయకుల కథతో కొత్తగా వర్మ తీసిన సినిమా కొండా. కొండా మురళి, కొండా సురేఖల బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో మిగితా సినిమాల మాదిరిగానే పెద్ద హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ నెల 23న ఈ సినిమా ఎప్పుడైతే అభిమానుల ముందుకు వచ్చిందో… అప్పుడు అర్దం అయ్యింది అందరికి ఇది కూడా అన్ని సినిమాల మాదిరిగానే ప్లాప్ అయ్యింది. అయితే వర్మ ఎప్పుడూ చెపుతుంటాడు తాను సినిమాలు చేస్తాడు కాని.. గెలుపోటముల గురించి అస్సలు పట్టించుకోను అని. అయితే వర్మ ఏమన్నా..నెటిజన్లకు మాత్రం మంచి ఛాన్స్ దొరికింది.. దొరికిందే ఛాన్స్ గా వర్మపై ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. 

వర్మ పాత సినిమాలకు వచ్చినంత కలెక్షన్ కూడా  ఈ సినిమాకు రాలేదు.. కొందరైతే కొండా అనుచరులు కూడా ఈ సినిమా చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వర్మ చేసిన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఈ ఫంక్షన్ లో కొండా సినిమా సీక్వెల్ గురించి వర్మ మాట్లాడాడు. కానీ ఇప్పుడు వచ్చిన సినిమానే దారుణంగా విఫలం కావడంతో… ఎటకారంగా కొండా సీక్వెల్ ఎప్పుడు అంటూ వర్మను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. 

కొందరైతే.. ఎన్నో అంచనాల మధ్య సినిమాకు వెళ్తే వర్మ మళ్ళీ నిరాశపరిచాడు అని అంటున్నారు. అయితే వచ్చిన నాలుగు రోజులోనే దాదాపుగా థియేటర్ల నుండి వెళ్లిపోయిన కొండా సినిమా.. ఇంకో వారం రోజులోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. మరి వర్మ ఈ సినిమాకు సీక్వెల్ తీస్తాడా.. లేదా అనేది చూడాలి. అసలు ఈ ట్రోల్స్ గురించి స్పందిస్తాడా..? స్పందిస్తే.. ఏమంటాడు చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios