సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం క్లైమాక్స్‌. గతంలో పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవాతో జీఎస్‌టీ (గాడ్‌ సెక్స్ అండ్‌ ట్రూత్‌) అనే సినిమాను తెరకెక్కించాడు వర్మ. ఇప్పుడు మరోసారి అదే మియా మాల్కోవాతో ఓ థ్రిల్లర్ మూవీని రూపొందించాడు. లాక్‌ డౌన్‌ సమయంలో అంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం తన సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి డిజిటల్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్‌ అయ్యింది.

జీఎస్‌టీలో ఫుల్‌ న్యూడ్‌ షో చూపించిన వర్మ, ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో గ్లామర్‌ షో చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీజర్‌లో మియా అందాలను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు ఆర్జీవీ అదే సమయంలో కథా కథనాలు ఎలా ఉండబోతున్నాయో కూడా హింట్‌ ఇచ్చాడు. శ్రేయాస్ ఈటీ ప్రొడక్షన్‌ సమర్పణలో కంపెనీ, ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్‌ లు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మే 18 ఉదయం 9:30కు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు వర్మ. ఈ సినిమా ఈ కష్టకాలంలో వర్మ, మియా మాల్కోవాలు ఇస్తున్ గిఫ్ట్ అని ప్రకటించాడు వర్మ.