Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్ ట్విస్ట్: 'ఆచార్య' కు నిర్మాతే కానీ రామ్ చరణ్ పైసా పెట్టడట

 రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా పేరు వేస్తున్నా, ఆయన ఈ చిత్రం ప్రొడక్షన్ కు సింగిల్ పైసా ఖర్చుపెట్టడని చెప్తున్నారు. పూర్తిగా నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఖర్చు పెడతారు

Ram Charan Won't Spend money On Acharya!
Author
Hyderabad, First Published Mar 21, 2020, 9:20 AM IST


స్టార్స్ గత రోజుల్లో లాగ ఉండటం లేదు. సినిమా నుంచి వచ్చే ప్రతీ పైసాలో తమ వాటా ఎంత ఉందనేది లెక్కేస్తున్నారు. తమ ఇమేజ్ తో జరిగే గేమ్ అని స్టార్స్ కు పూర్తిస్దాయిలో అర్దమవటంతో ఆ మేరకు వర్కవుట్ చేసుకుంటున్నారు. తమ సొంత బ్యానర్ లో చేసే సినిమాలకు సైతం రెమ్యునేషన్స్ తీసుకుంటున్నారు. అలాగే షేర్ సైతం డిమాండ్ చేస్తున్నారు. మొన్న అలవైకుంఠపురములో ...జరిగింది అదే. ఇప్పుడు ఎన్టీఆర్ 30 వ చిత్రానికి తన సోదరుడు కళ్యాణ్ షేర్ హోల్డర్ గా ఉంటున్నారు.అదే పద్దతిని రామ్ చరణ్ సైతం తన ఆచార్య సినిమాకు ఫాలో అవుతున్నట్లు సమాచారం.
 
రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా పేరు వేస్తున్నా, ఆయన ఈ చిత్రం ప్రొడక్షన్ కు సింగిల్ పైసా ఖర్చుపెట్టడని చెప్తున్నారు. పూర్తిగా నిరంజన్ రెడ్డి నిర్మాతగా ఖర్చు పెడతారు. రామ్ చరణ్ తను ఆచార్య లో చేస్తున్నందుకు రెమ్యునేషన్ తీసుకోవటమే కాకుండా, నిర్మాతగా ఫిఫ్టీ వాటా సైతం తీసుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. సైరా లో పోగొట్టుకున్న మొత్తాన్ని ఆచార్యతో రికవరీ చేయటానికే ఇలా చేస్తున్నాడంటున్నారు. అయితే ఈ సినిమాకు సంభందించిన ఫైనాన్సియల్ డీల్స్,ఫైనాన్స్ లు మొత్తం నిరంజన్ రెడ్డి చూసుకుంటారట.
 
అయితే ఇక్కడ రామ్ చరణ్ కేవలం నిర్మాతగా వాటా తీసుకోవటానికి కారణం ఆయన తన ఇమేజ్ ని ఇక్కడ పెట్టుబడిగా పెట్టడమే. రామ్ చరణ్ సొంత ప్రొడక్షన్ సినిమా అంటే వచ్చే హైప్ వేరు. దాన్ని నిర్మాత క్యాష్ చేసుకోగలుగుతాడు. ఇలా ఇద్దరి వైపు నుంచి లాభసాటి వ్యాపారం. కాకపోతే డబ్బులు పెట్టకుండా కేవలం ఇమేజ్ ని పెట్టుబడిగా పెట్టి షేర్ తీసుకోవటం మాత్రం బయిటనుంచి చూస్తే ఆశ్చర్యకరమైన విషయం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios