Asianet News Telugu

కార్ రేసర్ తో రామ్ చరణ్ మరదలు నిశ్చితార్థం... ఫోటోలు వైరల్

 కార్ రేసర్ అర్మన్‌ ఇబ్రహీం, అనుష్పాల కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ బంధానికి పెద్దలు కూడా ఓకె చెప్పడంతో పెళ్ళికి సిద్ధం అయ్యారు. దీనితో అర్మన్, అనుష్పాల నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. 

ram charan wife upasana sister anushpala gets engaged ksr
Author
Hyderabad, First Published Jul 19, 2021, 7:47 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రామ్ చరణ్ మరదలు ఉపాసన చెల్లి అనుష్పాల పెళ్లి పీటలు ఎక్కనుంది. ఆమె ప్రేమించిన వాడితో ఏడడుగులు వేయనుంది. కాబోయేవాడితో దిగిన ఫోటోలు అనుష్పాల సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ గా మారాయి.  కార్ రేసర్ అర్మన్‌ ఇబ్రహీం, అనుష్పాల కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ బంధానికి పెద్దలు కూడా ఓకె చెప్పడంతో పెళ్ళికి సిద్ధం అయ్యారు. దీనితో అర్మన్, అనుష్పాల నిశ్చితార్ధం కూడా జరుపుకున్నారు. అర్మాన్ తో సన్నిహితంగా దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అనుష్పాల. 


అనుష్పాల అక్క  ఉపాసన కూడా వారిద్దరి ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'నా డార్లింగ్స్‌కు అభినందనలు' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై ఆమె అభిమానులతో పాటు కాజల్‌, తమన్నా వంటి పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉపాసన సోదరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఉపాసన, రామ్‌చరణ్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 


వేల కోట్లకు అధిపతి అయిన అనుష్పాల మనసు దోచుకున్న ఆ వ్యక్తి ఎవరా అని ఆరా తీస్తే...  మాజీ ఇండియన్‌ ఫార్ములా 3 ఛాంపియన్‌ అక్బర్‌ ఇబ్రహీం తనయుడే అర్మన్‌ ఇబ్రహీం. ఇతడు కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనుష్పాల అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావుల మనవరాలు, శోభన- అనిల్‌ కామినేనిల కూతుళ్లే అనుష్పాల, ఉపాసన. 


 

Follow Us:
Download App:
  • android
  • ios