రామ్ చరణ్ తన కెరీర్ మొదట నుంచీ తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తన తండ్రి వేలు పట్టుకునే స్దాయి నుంచి తన తండ్రిని వేలు పట్టించి నడిపించే దాకా వచ్చారు. తను నిర్మాతగా తన తండ్రి హీరోగా సినిమాలు చేస్తూ సక్సెస్ లు సాధిస్తున్నారు. అయితే ఏ ప్రాజెక్టు ఓకే చేయాలన్నా తన తండ్రిదే చివరి నిర్ణయం. ఆ విషయం రామ్ చరణ్ తో జర్నీ చేసే వారందరికీ తెలుసు. అయితే తన కెరీర్ లో సంపత్ నందితో తప్పించి ఏ కొత్త దర్శకుడుతోనూ సినిమా చెయ్యలేదు. 

అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త నీరు ప్రవహిస్తోంది. స్టార్ డైరక్టర్స్ అనుకునే వాళ్ళంతా వరస ప్రాజెక్టులతో బిజిగా ఉన్నారు. అయితే కొత్త దర్శకుడు చేతిలో కోట్ల రూపాయల  ప్రాజెక్టులు పెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. అవతలి వారి స్టామినా పై నమ్మకం కలగాలి. రీసెంట్ గా అలాంటి నమ్మకమే ఓ కొత్త దర్శకుడు కథ విన్నాక రామ్ చరణ్ కు కలిగిందిట. ప్రదీప్ అనే ఓ కొత్త దర్శకుడు రామ్ చరణ్ కు కథ చెప్పించి ఓకే చేయించుకున్నాడట. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఆ సినిమా చెయ్యాలనే ఫిక్స్ అయ్యారట. అయితే ఈ నిర్ణయం విని మొదట చిరంజీవి షాక్ అయ్యారట. 

ఆర్ ఆర్ ఆర్ వంటి ప్రతిష్టాత్మక సినిమా తర్వాత పెరిగే క్రేజ్ ని తట్టుకోగలిగే డైరక్టర్ ఉండాలి. లేకపోతే బాహుబలి తర్వాత సాహో వచ్చినట్లే అవుతుందని ఆయన ఫీలయ్యారట. దాంతో ఆ కుర్రాడ్ని పిలిపించి తను కూడా కథ విన్నారట. ఆ కథ చెప్పిన విధానానికి చిరంజీవి కూడా ప్లాట్ అయ్యారట. చరణ్ నిర్ణయం మంచిదే అని మెచ్చుకున్నారట. ఇక ఈ చిత్రం ఓ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో  రూపొందనుందని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి చిరంజీవి కూడా కొన్ని మార్పుచేర్పులు సూచించి మరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని ఫిల్మ్ నగర్ టాక్.