సల్మాన్‌ ఖాన్‌ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ రూమర్స్ వైరల్‌ అవుతుంది. ఇందులో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 

సినిమా ఇప్పుడు భాషా భేదాన్ని చెరిపేస్తుంది. ఇండియన్‌ సినిమా ఒకటవబోతుంది. సినిమా నిర్మాణం ఏ భాషకి ఆ భాషలో జరిగినా, రిలీజ్‌ మాత్రం ప్రధాన లాంగ్వేజెస్‌లో విడుదల చేస్తూ పాన్‌ ఇండియా ఫ్లేవర్‌ తీసుకొస్తున్నారు. దీంతో భాషా భేదాలు తగ్గిపోతున్నాయి. టాలీవుడ్‌లో వరుసగా పాన్‌ ఇండియా చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరైన సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) సైతం పాన్‌ ఇండియాని టార్గెట్‌ చేసినట్టున్నారు. ఆయన నటిస్తున్న సినిమాల్లో పాన్‌ ఇండియా స్టార్స్ ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. 

ప్రస్తుతం సల్మాన్‌ ..`కబీ ఈద్‌ కబీ దివాళీ`(Kabhi Eid Kabhi Diwali) చిత్రంలో నటిస్తున్నారు. ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో `విక్టరీ` వెంకటేష్‌(Venkatesh) మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజాకి అన్న పాత్రలో వెంకీ కనిపిస్తారట. సల్మాన్‌కి ఫ్రెండ్‌గా, పూజాకి బ్రదర్‌గా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. 

మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ రూమర్స్ వైరల్‌ అవుతుంది. ఇందులో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌(Ram Charan) గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. సినిమాలో ఓ భారీ సాంగ్‌ ఉందని, అందులో చరణ్‌ మెరవబోతున్నట్టు తెలుస్తుంది. సల్మాన్‌ ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న `గాడ్‌ ఫాదర్‌`లో ఎక్స్ టెండెడ్‌ గెస్ట్ రోల్‌ చేశారు. చిరంజీవికి సపోర్ట్ గా, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే పాత్రలో సల్మాన్‌ కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం సల్మాన్‌ పారితోషికం తీసుకోలేదని సమాచారం. 

ఈ నేపథ్యంలో చరణ్‌ సైతం సల్మాన్‌ అడగ్గానే వెంటనే `కబీ ఈద్‌ కభీ దివాళీ` చిత్రంలో గెస్ట్ రోల్‌ చేసేందుకు ఒప్పుకున్నారట. సల్మాన్‌, వెంకీ, చరణ్‌ల మధ్య మంచి స్నేహం ఉంది. `దబాంగ్‌3` ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినప్పుడు చరణ్‌, వెంకీ గెస్ట్ లుగా హాజరయ్యారు. అంతేకాదు చరణ్‌ ముంబయి ఎప్పుడు వెళ్లినా సల్లూభాయ్‌ని కలుస్తారట. ఆ మధ్య `ఆర్‌ఆర్‌ఆర్‌` ముంబయి ఈవెంట్‌కి కూడా కండలవీరుడు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆ పరిచయంతోనే చరణ్‌.. ఆయన సినిమాలో అతిథిగా కనిపించేందుకు ఓకే చెప్పారని టాక్‌. 

 సల్మాన్‌ ఇప్పుడు సౌత్‌ని టార్గెట్‌ చేశారు. తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆడుతున్నాయి. తెలుగు మార్కెట్‌ పెరిగింది. దీంతో ఆయన టాలీవుడ్‌ని టార్గెట్‌ చేసినట్టు తెలుస్తుంది. అందుకే తెలుగులో పాపులర్‌ స్టార్స్ ని తన సినిమాలో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నారట. వెంకీ, రామ్‌చరణ్‌, పూజాలు టాలీవుడ్‌లో స్టార్స్ గా రాణిస్తున్న విషయం