కొన్ని కాంబినేషన్స్ వింటానికి చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇక ఆ కాంబోలు తెరకెక్కితే వచ్చే కిక్కే వేరు. అలాంటి మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తూంటారు. అలాంటి ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూ..పవన్,మెగా పవర్ స్టార్ అభిమానులను ఆనందపరుస్తోంది. ఆ వార్త ఏమిటంటే...పవన్ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనపడనున్నారని. ఇంతకీ పవన్ చేస్తున్న ఏ సినిమాలో ఈ ట్రీట్ మనకు కనిపించబోతోంది అనే కదా మీ డౌట్. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ..క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఈ కాంబో కనపడనుంది. క్రిష్ ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు. బాబాయ్...అబ్బాయ్ ఒకే సారి తెరపై కనపడితే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మనం గెస్ చేయచ్చు.  అందులోనూ తొలిసారి ఇలాంటి సీన్ ని తెరపై కనపడతూండటంతో అప్పుడే సంబరాలు మొదలైపోయాయి. అయితే ఈ విషయం ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. 

ప్రస్తుతానికి ఓ ప్రపోజల్ మాత్రమే క్రిష్ పెట్టాడని అంటున్నారు. రామ్ చరణ్ ని కలిసి క్యారక్టర్ వినిపించమని పవన్ సూచించారట. దాంతో అతి త్వరలోనే రామ్ చరణ్ ని కలిసి ఈ పాత్ర గురించి డిస్కస్ చేస్తారని అంటున్నారు. అయితే ఈ వార్త రూమర్ గా మిగలే అవకాసం ఉందా లేదా నిజమౌతుందా అంటే ..అది రామ్ చరణ్ కు ఉన్న డేట్స్, పరిమితులను బట్టి ఆధారపడుతుంది అంటున్నారు. అయితే రామ్ చరణ్ కు అనుకున్నది చాలా చిన్న రోల్, గెస్ట్ రోల్ కాబట్టి సాధారణంగా నో చెప్పే అవకాసం ఉండదని చెప్తున్నారు.

ముఖ్యంగా రామ్ చరణ్ ..ఆర్ ఆర్ ఆర్  సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రావాలి. అలాగే తన తండ్రి ,కొరటాల కాంబినేషన్ లో జరుగుతున్న చిత్రంలో తన పాత్రను కూడా చేయాలి. అప్పుడు ఉన్న పరిస్దితిని బట్టి డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తారు.