Asianet News TeluguAsianet News Telugu

కొత్త లగ్జరీ కారు కొన్న రాంచరణ్.. వైరల్ అవుతున్న వీడియో

టాలీవుడ్ స్టార్ హీరోలకు లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువ. స్టార్ హీరో ఏ కారు కొన్నా ఇట్టే వార్తల్లో వైరల్ అయిపోతుంది. ఆ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్గిని కారుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Ram Charan buys new luxury car here is details
Author
Hyderabad, First Published Sep 13, 2021, 11:11 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలకు లగ్జరీ కార్లంటే మోజు ఎక్కువ. స్టార్ హీరో ఏ కారు కొన్నా ఇట్టే వార్తల్లో వైరల్ అయిపోతుంది. ఆ మధ్యన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన లంబోర్గిని కారుని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది. 

కారు ట్రక్ లో నుంచి డెలివరీ కావడం, రాంచరణ్ ఆ కారుని డ్రైవ్ చేయడం ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాంచరణ్ కొన్న కారు పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్‌ 600. అధునాత ఫీచర్స్ కలిగిన ఈ కారుని రాంచరణ్ తన టేస్ట్ కు తగ్గట్లుగా డిజైన్ చేయించుకున్నారట. 

కొత్త కారు డెలివరీ అయిన సందర్భంగా రాంచరణ్ తన టీంతో కలసి సెలెబ్రేట్ చేసుకున్నారు. కారు డెలివరీ కాగానే రాంచరణ్ దానిని డ్రైవ్ చేశారు.బ్లాక్ కలర్ లో ఉన్న ఈ కారు సూపర్ స్టైలిష్ గా ఉంది. 

ఇప్పటికే రాంచరణ్ గ్యారేజ్ లో ఫెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ లాంటి కార్లు ఉన్నాయి. తాజాగా కొన్న కారు ధర 2.5 కోట్లుగా తెలుస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే రాంచరణ్ ఖాతాలో రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సరైన టైం కోసం ఎదురుచూస్తోంది. 

ఇక శంకర్ దర్శకత్వంలోని చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. రాంచరణ్ కి జోడిగా ఈ చిత్రంలో కియారా అద్వానీ నటిస్తోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios