అవును ..రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికు పాఠాలు నేర్పి, స్పూర్తి రగిలించబోతున్నాడు. అయితే అది నిజ జీవితంలో కాదు..వెండి తెరపై. ఓ విభిన్నమైన క్యారక్టరైజేషన్ తో చిరంజీవి చేసే  పాత్రను ఉత్తేజపరచబోతున్నాడు. కొడుకు నుంచి తీసుకున్న స్పూర్తితో చిరు ముందుకు వెళ్ళి ఓ గొప్ప ఆశయం సాధిస్తాడని చెప్తున్నారు. గెస్ చేసే ఉంటారు. ఇది ఏ సినిమా అనేది. మీరు ఊహించిందే...మేము మాట్లాడుతోంది.. ఆచార్య సినిమాలో చరణ్ క్యారక్టరైజేషన్ గురించే.

వివరాల్లోకి వెళితే...చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఎంటర్టైన్మెంట్  కు చక్కటి మెసేజ్ ని  జోడించిన కథ ఇది. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. మొదట ఈ పాత్రలో మహష్ బాబుని అనుకున్నారు. అయితే రకరకాల కారణాలతో మహేష్ సీన్ నుంచి తప్పుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ నుంచి వచ్చి చరణ్ ఈ పాత్ర చేయబోతున్నారు. దాంతో చరణ్ పాత్ర ఏమిటి? ఈ సినిమాలో ఆయన ఎలా కనిపించనున్నాడు? అనేది అభిమానుల్లో ఆసక్తికరమైన టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో ..జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడనేది  సమాచారం. సినిమాలో సెకండఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా చరణ్ పోర్షన్ వస్తుందని అంటున్నారు. ఆయన పాత్ర .. కథను మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. ఆ పాత్ర ఆశయం .. భావజాలం నుంచి 'ఆచార్య' స్ఫూర్తిని పొంది తన పోరాటాన్ని కొనసాగిస్తాడని చెప్తున్నారు. తెరపై చరణ్ పాత్ర 30 నిమిషాల నిడివి కలిగి ఉంటుందనీ, ఆయన కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందని,అందుకే ఓకే చేసాడని అంటున్నారు. అయినా తండ్రి సినిమాలో చేయమంటే చెర్రీ కాదంటాడా.