రామ్‌ పోతినేని, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ యాక్షన్‌ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఫ్యాన్స్ ని ఇది ఖుషీ చేస్తుంది. 

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌.. మాస్‌ యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ సినిమాకి ఎలాంటి టైటిల్‌ ఉండబోతుందనే ఆసక్తి, సస్పెన్స్ తో ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది టీమ్‌. మరో రెండు రోజుల్లో సర్‌ప్రైజ్‌ రివీల్‌ చేయబోతున్నట్టు తెలిసింది. 

జులై 3న టైటిల్‌ గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు తెలిసింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులో రామ్‌ యాక్షన్ అవతార్‌లో ఉన్నారు. నీళ్లలో ప్రత్యర్థులను అంతం చేస్తూ విరోచితంగా కనిపిస్తున్నారు. అయితే ఆయన లుక్‌ని వాటర్‌తో కనిపించకుండా చేసింది టీమ్‌. సోమవారం రోజు పూర్తి లుక్‌ విడుదల చేసే అవకాశం ఉంది. కానీ చూడబోతుంటే, బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్‌తో ఈ సినిమా ఉంటుందని తాజాగా పోస్టర్‌ స్పష్టం చేస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్‌ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట. 

రామ్‌ మరోసారి పూర్తి ఊరమాస్‌ లుక్‌లో కనిపించబోతున్నారు. `ఇస్మార్ట్ శంకర్‌`లోనూ ఆయన ఇలాంటి మాస్‌ రోల్‌ చేశారు. ఇప్పుడు దాన్ని మించి ఊరమాస్‌గా కనిపిస్తాడని సమాచారం. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి `స్కంథ` అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. 

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి భాషల్లో ఈ సినిమాని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 15న సినిమాని విడుదల చేయబోతున్నారు. దీనికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. `ది వారియర్స్` వంటి డిజాస్టర్‌ తర్వాత రామ్‌ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఆయనకు ఇప్పుడొక హిట్‌ కావాలి. ఇక `అఖండ` తర్వాత బోయపాటి నుంచి వస్తోన్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి రామ్‌కి బోయపాటి హిట్‌ ఇస్తాడా? చూడాలి.