ఆ మధ్యన వరస ఫ్లాప్ లతో వెనకబడ్డ రామ్ ...ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బాక్ అయ్యారు. అంతేకాదు ఆయన తదుపరి చిత్రం రెడ్ సైతం మంచి క్రేజ్ క్రియేట్ చేస్తోంది. లౌక్ డౌన్ పూర్తికాగానే మార్కెట్ లోకు వచ్చే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరో ప్రక్క సౌత్ ఇండియాలోనే ఎవరు సాధించలేని ఘనత సాధించాడు  రామ్. ఇప్పటివరకు నాలుగు సినిమాలు 100 మిలియన్ వ్యూస్ సాధించిన ఏకైక హీరో రామ్. ప్రస్తుతం మన తెలుగులో హిట్ అయిన సినిమాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తున్నారు. అలా చేసిన రామ్ సినిమాలో 4 సినిమాలు 100  మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు నెలకొల్పాయి. 

ఈ మధ్యే పూరి జగన్నాధ్ రామ్ కంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాను ఫిబ్రవరి లో యూట్యూబ్ లో విడుదల చేసారు. అయితే ఆ సినిమా వ్యూస్ ఇప్పుడు 100  మిలియన్ దాటిపోతుంది. ఈ నేపధ్యంలో తన కెరీర్ లో గోల్డెన్ పీరియడ్ లోకి అడుగు పెట్టిన రామ్ ..ఆచి తూచి అడుగులు వెయ్యాలి. అయితే తాజాగా రామ్ తీసుకున్న ఓ నిర్ణయం ఫ్యాన్స్ ని షాక్ కు గురి చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం నిజమైతే...ఆయన త్వరలో శ్రీను వైట్లతో సినిమా చేయబోతున్నారు. అది కూడా రెడీ సీక్వెల్.  ఈ మేరకు రామ్ ని, ఆయన పెద నాన్న స్రవంతి రవి కిషోర్ ని ఇప్పటికే బౌండెడ్ స్క్రిప్టుతో శ్రీను వైట్ల ఒప్పించాడనని సమాచారం. 

 2008లో వచ్చిన రెడీ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఇప్పుడు కొత్త క్యారక్టరైజేషన్ తో పూర్తి కామెడీతో ఓ స్క్రిప్టుని రెడీ చేసినట్లు చెప్తున్నారు. ఇది విన్న చాలా మంది ...గత ఆరేళ్ళుగా వరస డిజాస్టర్స్ తో దూసుకుపోతున్న  శ్రీను వైట్ల తో సినిమా అంటే కెరీర్ పరంగా పెద్ద రిస్కే అంటున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ కు ముందు కూడా పూరి జగన్నాథ్ కెరీర్ పరిస్దితి ఏమీ బాగోలేదు. అయినా ధైర్యం చేసి రామ్ సినిమా చేసాడు. అది పెద్ద హిట్టైంది. ఇప్పుడు కూడా అదే రూటులో , అదే ధైర్యంతో శ్రీను వైట్లతో సినిమా చేసి పెద్ద హిట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడంటున్నారు.