చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల భామ రకుల్ ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్ దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీ ఇటీవల కాస్త స్లో అయ్యింది. బాలీవుడ్ ఆశలతో టాలీవుడ్ ఆఫర్లు వదులుకోవటంతో ఇక్కడ సినిమాలు తగ్గిపోయాయి. అదే సమయంలో బాలీవుడ్‌లో కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాకపోవటంతో అమ్మడి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. చివరగా తెలుగులో సీనియర్ హీరో నాగార్జున నటించిన మన్మథుడు 2 సినిమాలో నటించింది.

ప్రస్తుతం ఈ భామ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం భారతీయుడు 2లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్‌ చిత్రాలు కూడా అమ్మడి లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం లాక్‌ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ తన వంతుగా సేవా కార్యక్రమాలు చేస్తూనే తదుపరి చిత్రాలను లైన్‌లో పెట్టే పనిలో ఉంది. అయితే ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న బ్యూటీ పెళ్లి ప్రస్తావన కూడా మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా రకుల్ పెళ్లిపై ఆమె తల్లి స్పందించింది. రీసెంట్‌గా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె.. ఇప్పట్లో రకుల్‌కు పెళ్లి చేసే ఆలోచన లేనట్టుగా వెల్లడించింది. రకుల్ ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉందని, ఆమె కెరీర్‌ను డిస్టర్బ్‌ చేయటం తమకు ఇష్టం లేదని తెలిపింది. తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నన్నా.. ఎవరినీ చేసుకుంటా అన్నా మాకు అంగీకారమే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి తల్లి వ్యాఖ్యలపై రకుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.