ఇప్పుడు దేశం మొత్తం మీద కరోనా కన్నా హాట్ టాపిక్..లిక్కర్ షాపులు. వాటి ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద క్యూలు. ఎందుకంటే కరోనా మహమ్మారి రెచ్చిపోతోంది సామాజిక దూరం పాటించక పోతే అనే విషయం కూడా మర్చిపోయి...ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలో నిన్న వాట్సప్ లో చాలా మందికి రకుల్...లిక్కర్ కొంది అంటూ ఓ వీడియో వైరల్ అవ్వటం మొదలైంది. రకుల్ చేతిలో ఉన్న బాటిల్ చూసి ఆమె కూడా లిక్కర్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం సాగింది. అయితే అది ఫాల్స్ అని ఫేక్ అని తేలిపోయింది.

ఈ విషయమై రకుల్ స్పందించింది. “ఓహ్ వావ్! మెడికల్ షాపులు కూడా ఆల్కహాల్ అమ్ముతాయని నాకు తెలియదు ,”అంటూ విషయాన్ని కొట్టిపారేసింది. ఆమె కొన్న మెడికల్ సిరప్ బాటిల్స్ ని  ఇలా ప్రచారం చేసారని తేల్చింది.ముంబైలోని బాంద్రాలో ఓ మెడికల్ షాపు వద్ద రకుల్ ప్రీత్ మందులు కొనుగోలు చేసుకుని రోడ్డు దాటుతుండగా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. రకుల్ మెడికల్ షాపులో మందులు కోనుగోలు చేసిందని క్యాప్షన్ ఇచ్చారు.

దాంతో  కొందరు ఆకతాయులు రకుల్ వైన్ షాపుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసిందని తప్పుడు ప్రచారం మొదలెట్టారు. దీనిపై రకుల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు వీడియోను బయట పెట్టారు. మరో ప్రక్క రకుల్ స్పందనతో  అందరికీ క్లారిటీ వచ్చింది. కాగా ప్ర‌స్తుతం ర‌కుల్ అటు సినిమాల‌తోపాటు బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఎప్పుడూ వ‌ర్క‌వుట్ల‌తో బిజీగా ఉండే ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా కిచెన్‌లో సందడి చేసింది. హెల్తీ బ‌నానా చాక్లెట్ ఓట్‌మీల్ కుకీస్ త‌యారు చేశారు. దీనికి సంబంధించిన రెసిపీ వీడియోను షేర్ చేయ‌డంతో వైర‌ల్ అయ్యింది.