ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినిమాలకు సంబంధించిన షూటింగ్‌లు, ఇతర కార్యక్రమాలు ఆగిపోవటంతో సినిమా హీరోలు హీరోయిన్లు అంతా ఖాళీగా ఉంటున్నారు. దీంతో వారంతగా సోషల్ మీడియాలో టైం పాస్ చేస్తున్నారు. హీరోయిన్లయితే తమ వర్క్‌ అవుట్ వీడియోలతో పాటు తమ ఫోటో షూట్‌లకు సంబంధించిన హాట్ ఫోటలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇదే బాటలో ఇంట్రస్టింగ్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఇటీవల షర్ట్ బటన్స్‌ తీసి ఎద అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోను షేర్ చేసిన ఈ బ్యూటీ తాజాగా మరో హాట్ ఫోటోను షేర్ చేసింది. సూర్య కాంతి నాకు నచ్చిన నగ అంటూ టెప్టింగ్ కామెంట్‌తో తన సెక్సీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను షేర్ చేసింది రకుల్‌ ప్రీత్ సింగ్‌. హాట్‌ నెస్ ఓవర్‌ లోడెడ్‌ అన్నట్టుగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే చివరగా టాలీవుడ్‌ లో మన్మథుడు 2 సినిమాలో నటించిన ఈ బ్యూటీకి తరువాత టాలీవుడ్‌ నుంచి ఆఫర్‌ రాలేదు. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలతో పాటు తమిళ్‌లో రెండు సినిమాలు చేస్తోంది రకుల్‌. అయితే ఈ సినిమా షూటింగ్ లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోవటంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన రకుల్‌ ప్రీత్ సింగ్‌ సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుంది.