టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గాయి. దీంతో ఆమె తమిళ, హిందీ భాషల్లో ఛాన్స్ ల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమెకి బాలీవుడ్ లో అజయ్ దేవగన్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది.

వీరిద్దరూ కలిసి నటించిన 'దే దే ప్యార్ దే' సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో రకుల్ గ్లామర్ డోస్ కాస్త ఎక్కువైందనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో ఓ వీడియో సాంగ్ ని విడుదల చేశారు.

ఈ పాటలో రకుల్ మరింత గ్లామర్ గా కనిపించింది. చీర కట్టుకొని ఓ రేంజ్ లో అందాల ఆరబోత చేసింది. చేతిలో మందు బాటిల్ పట్టుకొని తాగుతూ పంజాబీ స్టైల్ లో పాట పాడుతూ రచ్చ చేసింది. ఈ పాటను రకుల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసింది రకుల్.

''వడ్డి షరాబన్ సాంగ్ రిలీజ్ అయింది. నేను నా ఉత్సాహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా.. ఈ పాట చిత్రీకరణ ఓ అధ్బుతమైన అనుభవం. అసలు మందే ముట్టుకోని నా నుండి తాగుబోతుని బయటకి తీసినందుకు బాస్కో మార్టిన్ డాన్స్ మాస్టర్ కి థాంక్స్'' అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.