సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్‌ కేసులో 25 మంది బాలీవుడ్‌ ప్రముఖుల పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. అందులో ముగ్గురు పేర్లని టైమ్స్ నౌ సంస్థ బయటపెట్టింది. వారిలో టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సైఫ్‌ అలీఖాన్‌ తనయు సారా అలీఖాన్‌, అలాగే రణ్‌వీర్‌ సింగ్‌ సన్నిహితురాలు సైమోన్‌ ఉన్నారు. 

ఇక  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌ ప్రముఖులు కావడంతో వీరి పేర్లు, వీరిపై వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. చిత్ర విచిత్రమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆటపట్టిస్తున్నారు. ఓ ఆట ఆడుకుంటున్నారు. 

వీరిని బాగా ట్రోల్‌ చేస్తున్నారు. మీమ్స్ రూపంలో రెచ్చిపోతున్నారు. ట్విట్టర్ లో పలు ఆసక్తికర మీమ్స్ హల్‌చల్‌ చేస్తున్నాయి. రియా జైల్లో ఉంది. ఇప్పుడు రకుల్‌, సారా, సైమోన్‌లకు హారతి పడుతున్నట్టు, పలు రకరకాల మీమ్స్ ని ట్రోల్ చేస్తున్నారు. అవేంటో చూద్దాం.