సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల కాలంలో యమ స్పీడ్ గా షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు. కబాలి నుంచి వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న తలైవా రీసెంట్ గా దర్బార్ షూటింగ్ ని కూడా వేగంగా పూర్తి చేశారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ మురగదాస్ ఈ బిగ్ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మొదటిసారి ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఫైనల్ గా షూటింగ్ పార్ట్ ని పూర్తి చేసిన చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టనుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాలో తలైవా డిఫరెంట్ షెడ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాకు సంబందించిన టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని దర్బార్ టీమ్ ప్రణాళికలు రచిస్తోంది.

సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. కాలా - పేట సినిమాలతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేని సూపర్ స్టార్ ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.  ఇక సినిమాలో నయనతారతో పాటు నివేత థామస్ కూడా కథానాయికగా నటిస్తోంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తుండగా లైకా ప్రొడక్షన్ లో సుభాస్కరన్ సినిమాను నిర్మిస్తున్నారు