Asianet News TeluguAsianet News Telugu

రాజశేఖర్ 'కల్కి' ఫస్ట్ లుక్!

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'కల్కి'. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని న్యూఇయర్ సందర్భంగా విడుదల చేసారు. 

rajasekhar 'kalki' movie first look poster
Author
Hyderabad, First Published Jan 1, 2019, 4:50 PM IST

సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'కల్కి'. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని న్యూఇయర్ సందర్భంగా విడుదల చేసారు.

నిన్న విడుదలైన టీజర్, ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేవిగా ఉన్నాయి. 1983 బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. హ్యాపీ న్యూఇయర్ 1983 అంటూ విడుదల చేసిన రాజశేఖర్ లుక్ ఆ కాలానికి తగ్గట్లుగా ఉంది.

'గరుడ వేగ' చిత్రంతో సక్సెస్ కొట్టిన రాజశేఖర్ ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో 'కల్కి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. 'అ!' లాంటి విభిన్నమైన సినిమాను రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటాడని అంటున్నారు. మరి రాజశేఖర్ ఆశిస్తోన్న సక్సెస్ ఈ 'కల్కి' ఇస్తుందో లేదో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios