జపాన్ ఫ్యాన్స్ ను చూసి ఉబ్బితబ్బిపోయిన రాజమౌళి

Rajamouli with Japan fans
Highlights

జపాన్ ఫ్యాన్స్ ను చూసి ఉబ్బితబ్బిపోయిన రాజమౌళి

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి సినీ అభిమానులు బ్రహ్మరథం పట్టారు. జపాన్‌లో బాహుబలి 2 రిలీజై వంద రోజులు అక్కడ పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడికి వెళ్లిన ఆయన.. అభిమానులతో కలిసి సందడి చేశాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసిన విషయం తెల్సిందే! త్వరలో చైనాలోనూ విడుదల కానుంది. జక్కనను చూసిన అభిమానులు ఆనందానికి హద్దులు లేకుండాపోయింది. టోక్యోలో బాహుబలి 2 ప్రదర్శన అద్భుతంగా సాగడానికి కారణమైన అభిమానులను గతరాత్రి కలవడం చాలా హ్యాపీగా వుందని, సినిమాలపై ప్రేమకు హద్దులంటూ లేవంటూ ట్వీట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో రాజమౌళి అక్కడి ప్రేక్షకులతో కలిసి వీడియోని అభిమానులతో షేర్ చేశాడు. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader