Asianet News TeluguAsianet News Telugu

ఫైనల్ గా పూరి దారిలోనే రాజమౌళి

రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రణం రుధిరం రౌద్రం).  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం కరోనా దెబ్బతో వచ్చిన లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయింది. మరో 30 శాతం షూటింగ్‌ మిగిలి ఉంది.ఇంతకాలం  హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఆర్ ఆర్ ఆర్ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. కరోనా కేసులు ఎక్కువ ఉండటంతో అక్కడ ఎప్పుడు పరిస్దితులు నార్మల్ కు వస్తాయో తెలియటం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ఆంక్షల వల్ల షూటింగ్ కు పర్మిషన్స్ దొరకవు. దాంతో పూణే షెడ్యూల్ ప్రశ్నర్ధకంగా మారింది. 

Rajamouli Shelves Pune schedule
Author
Hyderabad, First Published May 18, 2020, 8:59 AM IST


యంగ్‌టైగర్‌​ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌లతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రణం రుధిరం రౌద్రం).  డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం కరోనా దెబ్బతో వచ్చిన లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోయింది. మరో 30 శాతం షూటింగ్‌ మిగిలి ఉంది.ఇంతకాలం  హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఆర్ ఆర్ ఆర్ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. కరోనా కేసులు ఎక్కువ ఉండటంతో అక్కడ ఎప్పుడు పరిస్దితులు నార్మల్ కు వస్తాయో తెలియటం లేదు. ఈ నేపథ్యంలో అక్కడి ఆంక్షల వల్ల షూటింగ్ కు పర్మిషన్స్ దొరకవు. దాంతో పూణే షెడ్యూల్ ప్రశ్నర్ధకంగా మారింది. 

ఈ షెడ్యూల్ ఆర్ ఆర్ ఆర్ కు చాలా ముఖ్యమైనది. ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ భామ అలియా భట్ టీమ్ తో జాయిన్ కానుంది. ఆమె ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనున్న విషయం తెల్సిందే. ఈ భారీ షెడ్యూల్ తో షూట్ దాదాపు పూర్తవుతుందని కూడా అంటున్నారు. మరి ఇలాంటి షెడ్యూల్ కు ఆటంకాలు ఏర్పడితే మళ్ళీ మిగతా పనులు కూడా వాయిదా పడుతాయి. ఈ క్రమంలో రాజమౌళి లోకల్ గా సెట్స్ వేసి, లాగించేద్దామనే డెసిషన్ తీసుకున్నట్లు చెప్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ మేరకు సెట్స్ వేయబోతున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ సైతం తన తాజా చిత్రం ఫైటర్ కు ముంబై ధారావిలో షూటింగ్ బాలెన్స్ ఉంది. దాన్ని హైదరాబాద్ లో సెట్స్ వేసి షూటింగ్ ఫినిష్ చేయబోతున్నారు. ఇప్పుడు రాజమౌళి సైతం అదే రూటులో ప్రయాణం పెట్టుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికార ప్రకటన లేదు. 

ఇక ఈ చిత్రాన్ని 2021 సంక్రాతికి విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేసింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా సినిమా విడుదల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణంగా రాజమౌళి సినిమా షూటింగ్‌ కంటే పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటారు. అయితే ఉండటం, గ్రాఫిక్స్‌ పనులు‌ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా ముందుగా అనుకున్న సమయానికి విడుదలవడం కష్టంగా మారింది. దీంతో 2021 సంక్రాంతికి రావాల్సిన `ఆర్‌ఆర్ఆర్‌` ఇప్పుడు వేస‌వికి వెళ్లిపోయే అవకాసం ఉందని తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios