ఈ సినిమాపై తమ అభిమాన దర్శకుల అభిప్రాయాలు సైతం తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. అలా బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ...పారసైట్ సినిమా చూసి ఎలా స్పందిస్తారు ...ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అని మీడియా వారు ఆయన్ని ప్రశ్నించారు. అందుకు రాజమౌళి మొహమాటం లేకుండా తన అభిప్రాయం చెప్పారు. అది విన్న చాలా మంది సినీ అభిమానులు షాక్ అయ్యారు. 

రాజమౌళి మాట్లాడుతూ..లాక్ డౌన్ టైంలో తాను చూసిన సినిమాల్లో పార‌సైట్ ఒక‌టని.. కానీ అది త‌న‌కు ఎక్క‌లేద‌ని అన్నాడు. సినిమా ఆరంభంలో కొంచెం నెమ్మ‌దిగా అనిపించింద‌ని.. మ‌ధ్య‌లోకి వ‌చ్చేసరికి తాను నిద్ర‌లోకి వెళ్లిపోయాన‌ని ఆ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళి చెప్ప‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లందుకుని ఆస్కార్లూ  అందుకున్న సినిమా త‌న‌కు న‌చ్చ‌లేద‌ని చెప్పి ఉండొచ్చు కానీ.. మ‌రీ నిద్ర‌పోయాన‌న‌డమే విడ్డూరమని వ్యాఖ్యానిస్తున్నారు.

కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు బోన్గ్ జోన్ హో తెరకెక్కించారు. విశేషం ఏమిటంటే ఆయన కూడా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో అవార్డ్ అందుకున్నారు.