లాక్ డౌన్ సమయం కావడంతో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం అయ్యిన సంగతి తెలిసిందే. అందరిలాగే ప్రమఖ దర్శకుడు రాజమౌళి సైతం ఇంట్లోనే ఉంటూ పుస్తకాలను చదువుతూ, సినిమాలు చూస్తూ గడిపేస్తున్నారు. అందులో భాగంగా ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రం చూసి దానిపై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ఆ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీలింగ్ క‌లిగింద‌ని, చూస్తూ అలానే ప‌డుకుండిపోయాన‌ని చెప్పుకొచ్చారు. నాకు స్లోగా ఉండే సినిమాలు నచ్చవని కామెంట్స్ చేశారు. 

ఆస్కార్ అవార్డుల‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా , ఉత్తమ ద‌ర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల‌లో ప‌లు అవార్డులు దక్కాయి. అయితే ఇలాంటి సినిమాపై రాజమౌళి నెగిటివ్ గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరమైన వాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో చాలా మంది ట్రోల్ చేసారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి...వస్తున్నాయి. దాంతో  ఏ సినిమాను అయినా మొత్తం చూశాకే కామెంట్ చేయాలని   నెటిజన్స్ విమర్శించారు. అలాగే  టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రాజమౌళి ఆస్కార్ అవార్డు సాధించిన సినిమా గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని అంటున్నారు. ఈ నేపధ్యంలో  తాజాగా ఏకంగా ఆస్కార్ అవార్డులపై మరో సంచలన వ్యాఖ్య చేశారు రాజమౌళి.

రాజమోళి మాట్లాడుతూ... 'పారసైట్' నచ్చకపోవడమనేది నా పర్సనల్ ఒపీనియన్.. అయినా ఆస్కార్ జ్యూరీలో కూడా లాబీయింగ్ జరుగుతుంది.. ఓ సినిమా జ్యూరీ సభ్యులు చూడాలంటే చాలా తతంగమే నడుస్తుంది.. అయినా సరే జ్యూరీ ప్రమాణాల్ని పాటిస్తుంటుందని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. నాకు గతంలోనూ ఆస్కార్ సాధించిన చాలా సినిమాలు  నచ్చలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాజమౌళి.  

ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది.