RRR Movie: ఎడిటింగ్ లో ఎన్టీఆర్ బెస్ట్ లుక్ లేపేసిన రాజమౌళి... ఇది మరో అన్యాయం!


ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మరో విషయంలో రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతమైన లుక్ మూవీలో లేకుండా చేశారు. ఇటీవల విడుదలైన కొమ్మ ఉయ్యాలా వీడియోలో ఎన్టీఆర్ లుక్ గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. 

rajamouli edited out ntr best look as komuram bheem from rrr movie


ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)హిట్ పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వలేదు. రాజమౌళి తెరకెక్కించిన ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ పాత్రకు ఆయన న్యాయం చేయలేదనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. ప్రేక్షకుల్లో నలుగుతున్న ఈ వాదన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ దృష్టికి కూడా వెళ్ళింది. ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ మీట్ లో పాల్గొన్న రామ్ చరణ్ ని ఓ రిపోర్టర్ ఇదే విషయం అడిగారు. ఆ సమయంలో పక్కన ఎన్టీఆర్, రాజమౌళి కూడా ఉన్నారు. తర్వాత తెలుగు మీడియా కూడా ఈ ప్రశ్న రాజమౌళికి సాధించింది. 

తెలివిగా డిప్లోమాటిక్ గా రాజమౌళి(Rajamouli), చరణ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఎంత కవర్ చేయాలనుకున్నా ఎన్టీఆర్ పాత్రను ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ రోల్ డామినేట్ చేసిందనేది నిజం. దాదాపు ఇద్దరికీ సమానమైన స్క్రీన్ స్పేస్ ఎలివేషన్ సీన్స్ ఉన్నప్పటికీ భీమ్ ని గైడ్ చేసే రామ్ గా చరణ్ (Ram Charan)మూవీలో ఉన్నతంగా అనిపించాడు. క్లైమాక్స్ పోరాట సన్నివేశాల్లో చరణ్ గెటప్, యాక్షన్ హైలెట్ గా నిలిచాయి. దీంతో రాజమౌళిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. 

కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలోని కొమ్మ ఉయ్యాలా కోన జంపాల ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్  చివర్లో మల్లిని బ్రిటీష్ కోట నుండి విడిపోయించి గూడెంకి తీసుకుతున్న సన్నివేశం ఉంది. ఆ సీన్ లో ఎన్టీఆర్ గెటప్ చాలా అద్భుతంగా ఉంది. ఎర్రని తలపాగా, నుదుటిపై బొట్టు, భుజాన బందూక్ తగిలించి భీమ్ గా ఎన్టీఆర్ మెస్మరైజ్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ బెస్ట్ లుక్ గా దీన్ని అభివర్ణించవచ్చు. 

ఈ గెటప్ లో వెండితెరపై ఎన్టీఆర్ ని చూపించి ఉంటే ఎంత బాగుండేది. కొమురం భీమ్ బెస్ట్ లుక్ ని ఎడిటింగ్ లో లేపేస్తావా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ గెటప్ లో ఒక్క సన్నివేశం ఎన్టీఆర్(NTR) పై తెరకెక్కించినా థియేటర్ లో మేము పండగ చేసుకునే వాళ్ళం కదా అంటూ వాపోతున్నారు. ఎడిటింగ్ లో కూడా ఎన్టీఆర్ కి రాజమౌళి అన్యాయం చేశాడంటున్నారు. ఎన్టీఆర్ నేపధ్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ లో తీసేసినట్లు సమాచారం. నిడివి తగ్గించడం కోసం రాజమౌళి ఇలా చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios