ప్రభాస్ ,రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి,బాహుబలి రెండు పార్ట్ లు వచ్చాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్. దాంతో వీళ్లద్దరి కాంబినేషన్ అంటే అభిమానులకే కాదు..ట్రేడ్ కు కూడా ఆసక్తే. అయితే ఇప్పుడు ప్రభాస్, రాజమౌళి ఇద్దరూ కూడా ఎవరి ప్రాజెక్టులలో వాళ్లు బిజీగా ఉన్నారు. ఈ నేపధ్యంలో వీళ్లు కలిసి మళ్లీ ఎప్పుడు సినిమా చేస్తారనేది ఆసక్తికరమైన విషయం. దీనిపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. తాను మళ్లీ ఎప్పుడు ప్రభాస్ తో చేస్తారో చెప్పుకొచ్చారు.

లౌక్ డౌన్ లో ఉన్న రాజమౌళి రీసెంట్ గా ఓ ఇంటర్వూ ఇచ్చారు. అందులో ప్రభాస్ తో మళ్లీ ఎప్పుడు సినిమా అనే ప్రసక్తి వచ్చింది. దానికి రాజమౌళి చాలా పాజిటివ్ గా స్పందించారు. రాజమౌళి మాట్లాడుతూ..“మేము ఇద్దరు ఐదేళ్ల పాటు కలిసి పనిచేసాము. మా ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉంది. ఏదైనా మంచి ఎక్సైటింగ్ సబ్జెక్ట్ వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని ప్రబాస్ తో చేస్తాను. ఇద్దరం మళ్లీ కలిసి పనిచేయాలనే ఉత్సాహంతో ఉన్నాం. తరుచుగా మేమిద్దరం కలుస్తూంటాము“ అన్నారు. అంటే ఇప్పుడు ప్రభాస్ కి తగ్గ సబ్జెక్ట్ దొరికితే ఆర్ ఆర్ ఆర్ తర్వాత ప్రభాస్ తో చేసినా ఆశ్చర్యం లేదన్నమాట. అయితే బాహుబలిని మించిన సబ్జెక్టు అయ్యి ఉండాలనేది మాత్రం నిజం. 

ఇక ప్రస్తుతం రాజమౌళి తన తాజా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. లౌక్ డౌన్ ఎప్పుడు లిప్ట్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు హీరోలు కలిసి చేస్తున్న చిత్రం కావటంతో అందరి దృష్టీ ఈ సినిమాపైనే ఉంది. అలాగే సముద్రఖని, అజయ్ దేవగన్ వంటి నటులు చేయటంతో సినిమాకు జాతీయ చిత్రం లుక్ వచ్చేసింది. దాంతో దేశం మొత్తం ఎదురుచూడటం మొదలెట్టారు. అసలే బాహుబలి వంటి సూపర్ హిట్ తర్వాత చేస్తున్న చిత్రం కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.