రాజ్ తరుణ్ కెరీర్ గత కొంత కాలంగా డల్ గా ఉంది అనటం కన్నా ఒక్క హిట్టూ లేదనటం బెస్ట్. హిట్ కోసం పరితపిస్తున్న రాజ్ తరుణ్ కు ఇప్పుడు సూపర్ ఆఫర్ వచ్చింది. అదీ పెద్ద నిర్మాణ సంస్ద సురేష్ ప్రొడక్షన్స్ నుంచి. దాంతో రాజ్ తరుణ్ ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నట్లు సమాచారం.  అయితే ఆ క్యారక్టర్ మాత్రం క్రాస్ జెండర్ పాత్ర కావటం విశేషం.

వివరాల్లోకి వెళితే హిందీలో ఆయుష్మాన్ నటించిన  తాజా చిత్రం `డ్రీమ్ గర్ల్`ని తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రైట్స్ కొన్నారు. ఇందులో  రాజ్ తరుణ్ హీరోగా నటించనున్నాడని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అది నిజమే అని తేలింది సెప్టెంబర్ 13న బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ చిత్రాన్ని రిలీజ్ చేస్తే పెద్ద హిట్టైంది.  

ఆయుష్మాన్ ఖురానా- నుష్రాత్ బరుచా జంటగా నటించిన  రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ `డ్రీమ్ గర్ల్`. బాలాజీ టెలీఫిల్మ్స్ సమర్పణలో.. శోభా కపూర్- ఏక్తా కపూర్ నిర్మించగా.. రాజ్ శాండిల్య డైరెక్ట్ చేసాడు.  

ఇది ఒక క్రాస్ జెండర్ సినిమా. ఆయుష్మాన్ ఖురానా అమ్మాయి గొంతు తో మాట్లాడుతూ ఒక కాల్ సెంటర్ లో పని చేస్తాడు. సినిమా అంతా కామెడీ, ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుంది. ఓ బేబి  రీమేక్ తో డి.సురేష్ బాబు టీమ్ మంచి ఉషారులో ఉంది. దాంతో `డ్రీమ్ గర్ల్` రీమేక్  తో   బ్లాక్ బస్టర్ విజయం అందుకోవాలనుకుంటున్నారు.