Asianet News TeluguAsianet News Telugu

ఆధారాలు నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా

రాజ్ కుంద్రా సంస్థలో పనిచేసుకున్న నలుగురు ఉద్యోగులు కొన్ని పోర్న్ క్లిప్స్ ని యాప్ నుండి తొలగించాల్సిందిగా ఆదేశించారని విచారణలో తెలియజేశారు. విచారణకు సహకరించకుండా.. ఆధారాలు నాశనం చేస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు.

raj kundra and his employees tried to delete evidences says lawyer
Author
Hyderabad, First Published Aug 2, 2021, 7:05 PM IST

పోర్నోగ్రఫీ ఆరోపణలపై అరెస్ట్ కాబడిన రాజ్ కుంద్రా కేసులో కోర్ట్ లో విచారణకు రాగా ఆసక్తికర విచారణలు సాగాయి. ఆధారాలు నాశనం చేస్తున్నందుకే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడం జరిగిందని ముంబై పోలీసుల తరపు న్యాయవాది తెలియజేశారు. రాజ్ కుంద్రా అరెస్ట్ చట్ట విరుద్ధం, ఎటువంటి ముందస్తు నోటీసులు అందించకుండానే అరెస్ట్ చేశారన్న ఆయన తరపున న్యాయవాది ఆరోపణలను.. పోలీసుల తరపు న్యాయవాది తోచిపుచ్చారు. 


రాజ్ కుంద్రా సంస్థలో పనిచేసుకున్న నలుగురు ఉద్యోగులు కొన్ని పోర్న్ క్లిప్స్ ని యాప్ నుండి తొలగించాల్సిందిగా ఆదేశించారని విచారణలో తెలియజేశారు. విచారణకు సహకరించకుండా.. ఆధారాలు నాశనం చేస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. రాజ్ కుంద్రా తన ఐ క్లౌడ్ అకౌంట్ డిలీట్ చేయడం జరిగింది. అలాగే 61 అసభ్యకర వీడియోలు, అడల్ట్ కంటెంట్ స్క్రిప్ట్ అతని లాప్ టాప్ లో గుర్తించినట్లు వెల్లడించారు. 


ఇక వాట్స్ యాప్ చాట్ లో ఇతర నిందితులతో చేసిన సంభాషణ, మార్కెటింగ్ స్ట్రాటజీస్ కి సంబందించిన ప్లాన్స్ గుర్తించినట్లు తెలిపారు. ఈ మెయిల్స్, బ్రౌజింగ్ హిస్టరీ, పేస్ టైం డిటైల్స్ కనుగొన్నట్లు ముంబై పోలీసుల తరపు న్యాయవాది వివరించారు. బలమైన ఆధారాలతో దొరికిపోయిన రాజ్ కుంద్రా మరింత చిక్కుల్లో ఇరుక్కున్నట్లు అర్థం అవుతుంది. ఇక రాజ్ కుంద్రా బెయిల్ నిరాకరించిన కోర్ట్, కస్టడీ పొడిగించిన విషయం తెల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios