బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో గేమ్‌ ఊపందుకుంది. కంటెస్టెంట్లు తగ్గే కొద్ది ఉత్కంఠ నెలకొంది. ప్రతి వారం ఒక్కొక్కరు తగ్గుతుంటే ఆట మరింత రక్తికడుతుంది. స్నేహంగా ఉన్నవాళ్లే శత్రువులుగా మారాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. పదో వారానికి ఇంట్లో తొమ్మిది మంది ఉన్నారు. పదో వారానికి `అరియానా, మెహబూబ్‌, హారికా, మోనాల్‌, సోహైల్‌, అభిజిత్‌ నామినేట్‌ అయ్యారు. ఈ వారం ఎవరు ఉంటారు? ఎవరు పోతారనేది ఉత్కంఠ రేపుతుంది. 

మరోవైపు అప్పుడే సీజన్‌ విన్నర్‌ ఎవరు అనే చర్చ కూడా ప్రారంభమైంది. ఇన్నాళ్ళు జరిగిన ఎపిసోడ్స్ ని బట్టి తమ ఊహలకు పని పెడుతున్నారు. అయితే ఇంతకు ముందే ఈ సీజన్‌ విన్నర అభిజిత్‌ అయ్యే ఛాన్స్ ఉందని గత సీజన్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ జోస్యం చెప్పాడు. తాను అభిజిత్‌ వైపు ఉన్నానని చెప్పాడు. మరోవైపు ఇప్పుడు ఆయన ప్రియురాలుగా చర్చ జరుగుతున్న పునర్నవి భూపాలం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. 

ఈ సీజన్‌లో ముగ్గురు తనకి ఇష్టమైన వాళ్ళున్నారని, అభిజిత్‌, అవినాష్‌, నోయల్‌ పేర్లు చెప్పింది. నోయల్‌ మధ్యలోనే వెళ్ళిపోయాడని, ఇక ఇప్పుడు అభిజిత్‌, అవినాష్‌లను బాగా మిస్‌ అవుతున్నానని పేర్కొంది. అభిజిత్‌ ఈ సీజన్‌ విన్నర్‌గా కనిపిస్తున్నాడని తెలిపింది. ఆయనకే ఫేవర్‌గా ఉందని పేర్కొంది. అయితే సీజన్‌ సీజన్‌కి గేమ్‌ మారుతుందని, ఇప్పుడు ఫైనల్‌ని నిర్ణయించలేమని, ఎవరు చివరి వరకు ఉంటారనేది మాత్రం సస్పెన్స్ గా ఉందన్నారు. 

ఈ సీజన్‌లో గంగవ్వని తీసుకోవడం గొప్ప విషయమని, ఆమె చాలా బాగా ఆడారని పేర్కొంది. అయితే నాగ్‌ సర్‌ని మిస్ అవుతున్నానని పేర్కొంది. మళ్ళీ హౌజ్‌లోకి వెళ్లే ఛాన్స్ లేదని చెప్పింది. గత సీజన్‌ వల్ల తనకు మంచి పేరొచ్చిందని, ఇప్పుడు అటు సినిమాలు, ఇటు వెబ్‌ సిరీస్‌తో బిజీగా ఉన్నట్టు పేర్కొంది. అయితే అటు రాహుల్‌, ఇటు పునర్నవి ఇద్దరూ అభిజిత్‌కే ఓటు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.