Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ రామకృష్ణ ఆ బూతు మాట..ఏ హీరోలని ఉద్దేశించి ?

క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ ఆవేశంతో అన‌రాని మాట అనేసారు. దీనిపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది. అందులోనూ ఆ మాటలు కొందరు హీరోలకు తగిలేలా ఉన్నాయి.

Rahul has now turned controversial fot a tweet
Author
Hyderabad, First Published Aug 30, 2021, 8:50 PM IST

ఏదో వివాదం లేకపోతే సినిమాలు జనాలను ఆకర్షించలేవా అనే సందేహం అప్పుడప్పుడూ కలిగిస్తూంటాయి కొన్ని స్టేట్మెంట్స్. భాద్యతాయుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు భాద్యతారాహిత్యంగా మాట్లాడినప్పుడు ఇబ్బందులు వస్తూంటాయి. సమాజంలో ఓ స్దాయిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట కాని , సోష‌ల్ మీడియాలో చేసే ప్ర‌తి పోస్ట్ విష‌యంలో కాని ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవసరం ఉంది. ఎవరేం మాట్లాడినా కూడా వారి లిమిట్స్‌లో వారు ఉండాలి. కాని క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ ఆవేశంతో అన‌రాని మాట అనేసారు. దీనిపై ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది. అందులోనూ ఆ మాటలు కొందరు హీరోలకు తగిలేలా ఉన్నాయి.

 వివరాల్లోకి వెళితే..రాహుల్ రామకృష్ణ, అవికా గోర్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ‘NET’ సినిమా ఈ నెల 10వ తేదీన ‘ZEE 5’ ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సీరిస్ లో రాహుల్.. పోర్న్ వీడియోలకు బానిసైన వ్యక్తిలా కనిపిస్తాడు. అవికా గోర్ ఇంట్లో రహస్య కెమేరాలు పెట్టి.. ఆ వీడియోలను ప్రసారం చేసే ఓ డార్క్ వెబ్‌సైట్‌‌లో రిజిస్టర్ అవుతాడు. అప్పటి నుంచి అవికా గోర్.. ప్రైవేట్ లైఫ్‌ను మోబైల్‌లో చూస్తూ ఎంజాయ్ చేస్తాడు. ఈ సందర్భంగా అతడికి ఊహించని ఛాలెంజ్ లు ఎదురవుతాయి. రీసెంట్ గా విడుదలైన టీజర్, ట్రైలర్లు.. ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందనే నమ్మకం కలిగించాయి. 

ఈ క్రమంలో రాహుల్ రామకృష్ణ ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ.. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికి మా సినిమా భయపడదని, మా సినిమాకు గు*లో దమ్ము ఉందని పేర్కొన్నాడు. రెండోసారి చేసిన ట్వీట్‌లో ‘‘మా సినిమాకు గు*లో దమ్ము ఉంది’’ అని పేర్కొన్నాడు. రాహుల్ రామకృష్ణ ఎవరినైనా టార్గెట్ చేసుకున్నాడా ? లేదా ఫ్రస్ట్రేషన్‌తో ఆ ట్వీట్ చేశాడా అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాగిన మైకంలో ట్వీట్ చేసి ఉంటాడని కొందరు అంటున్నారు. అయితే తనను ట్రోల్ చేస్తున్న నెటిజనులు ఉద్దేశిస్తూ.. ‘‘ట్విట్టర్లో అంతా పతీతులే అన్నమాట’’ అంటూ మరో ట్వీట్ చేశాడు. 

ఇక వినాయక చవితి పురస్కరించుకుని ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అదే రోజున నాని నటించిన ‘టక్ జగదీష్’, నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. టక్ జగదీష్‌ను అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో విడుదల చేస్తుంటే.. ‘లవ్ స్టోరీ’ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే, ‘లవ్ స్టోరీ’ సినిమాను వాయిదా వేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఈ ట్వీట్ కు ఈ హీరోలని ఉద్దేశించా అనేది కూడా ఆసక్తికరమైన విషయంగా మారింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios