Asianet News TeluguAsianet News Telugu

చిరుకు ఆ విలన్ సరిపోడంటూ రచ్చ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో విలన్ పాత్రకు మాజీ హీరోను ఎంపిక చేసినట్టు సమాచారం. ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను ఈ మాజీ హీరో తెలుగులో చేయబోతున్నారట. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

Rahman will be the main villain in Lucifer remake
Author
Hyderabad, First Published Jul 15, 2020, 8:27 AM IST

స్టార్ హీరో సినిమాల్లో హీరో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో అంతకు మించి విలన్ ఉండాలి. అప్పుడే సీన్స్ పండుతాయి. అంతేకానీ విలన్ డల్ గా ఉండే హీరోకు పెద్ద చెప్పుకోదగ్గ కిక్ ఉండదు. ఇది సినీ పరిశ్రమలో ఎన్నో సార్లు ప్రూవైన సత్యం. ఈ విషయాన్నే గుర్తు చేస్తున్నారు సోషల్ మీడియా జనం. చిరంజీవి ప్రక్కన ఆ విలనేంటి...సరిపోడు అని చెప్పేస్తున్నారు. ఇంతకీ ఏ సినిమా గురించి అంటారా...

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో విలన్ పాత్రకు మాజీ హీరోను ఎంపిక చేసినట్టు సమాచారం. ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రను ఈ మాజీ హీరో తెలుగులో చేయబోతున్నారట. మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్‌లాల్ ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.

 కరోనా మహమ్మారి పోయి పరిస్థితులు చక్కబడితే ఈ ఏడాది ఆఖరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ నటీనటుల ఎంపికలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, ‘లూసిఫర్’ మలయాళ వెర్షన్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ పాత్రను తెలుగులో ప్రముఖ నటుడు( రఘు) రెహమాన్ పోషిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. రెహమాన్‌ను నిర్మాత రామ్ చరణ్, డైరెక్టర్ సుజీత్ ఇప్పటికే సంప్రదించారని.. ఈ పాత్ర చేయడానికి రెహమాన్‌ కూడా ఆసక్తి చూపించారని అంటున్నారు.

రెహమాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మలయాళంలో 90ల్లో రెహమాన్ స్టార్ హీరో. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఈ మధ్య కాలంలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో రామ్ చరణ్‌కు ఆయన తండ్రిగా నటించారు. ‘జనతా గ్యారేజ్’, ‘అంతరిక్షం’ సినిమాల్లోనూ ఆయన కనిపించారు.  
 
 ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ యేడాది చివర్లో అంటే నవంబర్, డిసెంబర్ లో సినిమాని లాంచ్ చేస్తారని సమాచారం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించే ఈ చిత్రానికి  త్వరలోనే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.  ‘లూసిఫర్’ మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 12న విడుదల చేసారు. అయితే సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అకట్టుకోలేకపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios