ఆడిషన్ లోనే సెక్స్ చేయమన్నారట

First Published 23, Mar 2018, 10:44 AM IST
Radhika Apte reveals she had to do phone sex during the audition of the movie Dev
Highlights
  • రీసెంట్ గా నేహా ధూపియా నిర్వహించే చాట్ షో కు రాజ్ కుమార్ రావ్ తో కలిసి రాధికా ఆప్టే పాల్గొనింది
  • తన కొత్త సినిమాల గురించి చాలానే విషయాలు చెప్పిన ఈ భామ​
  • ఓ ఆడిషన్ లో మాత్రం చాలా విచిత్రమైన అనుభవాన్ని ఎధుర్కొందిట​

రీసెంట్ గా నేహా ధూపియా నిర్వహించే చాట్ షో కు రాజ్ కుమార్ రావ్ తో కలిసి రాధికా ఆప్టే అటెండ్ అయ్యింది. కాంప్లికేటెడ్ విషయాలను కూడా చాలా సింపుల్ గా బయటకు చెప్పేస్తూ ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.  అయినా సరే.. సెన్సేషనల్ కబుర్లను చక్కగా చెప్పేయడం ఈమెకు బాగా అలవాటు అయిపోయింది.ఈ సమయంలో ప్యాడ్ మ్యాన్ గురించి.. అలాగే తన కొత్త సినిమాల గురించి చాలానే విషయాలు చెప్పిన ఈ భామ.. ఓ ఆడిషన్ లో మాత్రం చాలా విచిత్రమైన అనుభవాన్ని ఎధుర్కొందిట. అది కూడా ఓ బాలీవుడ్ మూవీ కోసమే. దేవ్ డి టైటిల్ పై అనురాగ్ కశ్యప్ రూపొందించిన చిత్రం కోసం ఆడిషన్ కు వెళ్లానని చెప్పిన రాధిక.. ఇప్పటివరకూ తను ఫేస్ చేసిన ఆడిషన్స్.. ఇదే అత్యంత బీభత్సం అంటోంది. 'దేవ్ డి మూవీ కోసం ఫోన్ సెక్స్ చేయమని అన్నారు' అంటోంది రాధిక.

'నేను పూనేలో ఉంటాను. అప్పటివరకూ ఫోన్ సెక్స్ లాంటి అనుభవం నాకు లేదు. జుట్టు ముడి వేసుకుని.. లాలీపాప్ నోటిలో పెట్టుకుని.. ఇలా కొన్ని చేయాల్సి వచ్చింది. కానీ పూర్తయ్యేసరికి చాలా ఎంజాయ్ చేశాను. అయితే సినిమాలో మాత్రం అవకాశం రాలేదు' అని చెప్పింది రాధిక. చివరకు ఈ పాత్రను మహి గిల్ తో చేయించగా.. కల్కి కొచ్లిన్.. అభయ్ డియోల్ కీలక పాత్రలలో నటించారు.

loader