తక్కువ సినిమాలతో గ్లామర్ ఇండస్ర్టీలో పాపులర్ అయ్యింది హీరోయిన్ రాధికాఆప్టే. అందం, చక్కని అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఆమె సొంతం. ఏదో ఒక వివాదంలో కొనసాగుతూనే వస్తోన్న ఈ బ్యూటీ, బద్లాపూర్, హంటర్, పర్చెడ్ వంటి సినిమాలతో వార్తల్లోకెక్కింది. ఆయా సినిమాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి కూడా! 

ఇక అసలు విషయానికొస్తే.. కొన్ని సినిమాల్లో తాను ఎందుకు అందాలు ఆరబోయాల్సివచ్చిందో క్లారిటీ ఇచ్చేసింది ఆప్టే. గ్లామర్ ఇండస్ర్టీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే ఆఫర్స్ వస్తాయని, తనకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల అవకాశాలు రాలేదంటూ మనసులోని మాట బయటపెట్టింది. ఫిల్మ్ ఇండస్ర్టీలోకి రావాలనే కోరికతో ఢిపరెంట్‌ మూవీలు చేశానని, డబ్బు కోసమే వాటిలో నటించానని కుండబద్దలు కొట్టేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధికాఆఫ్టే.. లైఫ్‌లో ఎదగాలంటే అలాంటి చిత్రాల్లో నటించక తప్పలేదని, ఇప్పుడు తనకు పేరు, డబ్బు వుండడంతో సింపుల్‌గా ఆఫర్స్ వస్తున్నాయని వెల్లడించింది. ప్రస్తుతానికి అన్ని సినిమాల్లో నటించలేదని, కథ నచ్చితేనే ఒప్పుకుంటున్నానని చెప్పింది. అభిమానులు తనను మరచిపోకుండా అప్పుడప్పుడు తన గురించి రెండేసి విషయాలు బయటపెడుతోంది ఈ అమ్మడు. మొత్తానికి మార్కెట్ టెక్నిక్స్ బాగానే ఒంట బట్టించుకుంది.