Asianet News TeluguAsianet News Telugu

ఆ న్యూడ్ క్లిప్ తో డిస్టర్బ్ అయ్యా, డ్రైవర్ సహా..: బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే

క్లీన్ షేవన్ షార్ట్ ఫిల్మ్ చేసింది రాధికా ఆప్టే. అందులో ఒక సన్నివేశంలో తన డ్రెస్ ను ఎత్తిపట్టుకుని కిందంతా నేకెడ్ గా నటించింది. ఈ వీడియో ఎలా లీకైందో కానీ బయటకు వచ్చేసింది. ఈ వీడియో లీకైన తర్వాత తన దగ్గరి వాళ్ళే తనను తేడాగా చూసారని చెప్పి వాపోయింది. 

Radhika Apte has spoken on nude video leak jsp
Author
Hyderabad, First Published May 22, 2021, 7:51 AM IST

తమ న్యూడ్ వీడియో ని వేరే ఒకరు చూసారని విషయం తెలిస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదీ తన ఇంట్లో పనిచేసే డ్రైవర్ ,వాచ్ మ్యాన్ వంటి వాళ్లతో మరీ ఇబ్బంది. అదే విషయం ప్రస్దావిస్తూ రాధికా ఆప్టే చాలా ఫీలయ్యింది. ఆ విషయం జరిగి చాలా కాలం అయినా తాను మర్చిపోలేను అంటోంది.  

గతంలో లీకైన తన న్యూడ్‌  వీడియో గురించి నటి రాధికా ఆప్టే మరోసారి స్పందించారు. ఆ వీడియో తనది కాదని ఎవరో కావాలని సృష్టించారని 2016లోనే క్లారిటీ ఇచ్చారు. అయితే దాని వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయానని, బయట  తలెత్తుకోలేని పరిస్థితి ఎదురైందని ఆమె అన్నారు. ఈ విషయం గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడిందామె.

రాధికా ఆప్టే మాట్లాడుతూ.. ‘‘ఆ వీడియో బయటికి వచ్చినప్పుడు నన్ను ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడారు. ట్రోల్‌ చేశారు. నా డ్రైవర్‌, వాచ్‌మెన్‌, స్టైలిస్ట్‌ నన్ను ఆ ఇమేజ్‌ చూసి గుర్తించారు. నాలుగు రోజులు నేను బయట అడుగుపెట్టలేకపోయా. మానసిక వేదన అనుభవించా’’ అని అన్నారు.  

ఇక  రాధికా ఆప్టే తెలుగులో కూడా సినిమాలు చేసింది. బోల్డ్ రోల్స్ కు పెట్టింది పేరైన రాధికా ఆప్టే న్యూడ్ గా నటించడానికి కూడా వెనకాడలేదు.  క్లీన్ షేవన్ షార్ట్ ఫిల్మ్ చేసింది రాధికా ఆప్టే. అందులో ఒక సన్నివేశంలో తన డ్రెస్ ను ఎత్తిపట్టుకుని కిందంతా నేకెడ్ గా నటించింది. ఈ వీడియో ఎలా లీకైందో కానీ బయటకు వచ్చేసింది. ఈ వీడియో లీకైన తర్వాత తన దగ్గరి వాళ్ళే తనను తేడాగా చూసారని చెప్పి వాపోయింది. ఆ న్యూడ్ వీడియో లీక్ నన్ను ఎంతగానో డిస్టర్బ్ చేసింది అని చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios