`బాహుబలి` తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం `సాహో`. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అభిమానులను నిరాశపరిచింది. దాంతో తదుపరి సినిమాతో ఎలాగైనా ప్రభాస్ సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమాకు సంభందించిన ప్రతీ అంశంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో ఆచి,తూచి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని బాహబులి 2  రిలీజ్ డేట్ అయిన ఏప్రియల్ 24,2021 న విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటికి థియోటర్స్ ఓపెన్ అవుతాయి. వాక్సిన్ వస్తుంది. కరోనా సమస్య కూడా జనం మర్చిపోతారని భావిస్తున్నారు.

మరో ప్రక్క ‘రాధేశ్యామ్‌’ ఫస్ట్‌ లుక్‌ని రీసెంట్ గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫస్ట్ లుక్ కు  మంచి స్పందన లభిస్తోంది. శుక్రవారం విడుదల చేసిన ‘మొదటి లుక్’‌ సోషల్‌ మీడియాలో దూసుకుపోయింది. ట్విటర్‌లో   టాప్‌ ట్రెండింగ్‌లో చోటుదక్కించుకోవడమే కాకుండా తక్కువ సమయంలో సింగిల్‌ హాష్‌ట్యాగ్‌తో  ట్వీట్లు సాధించి రికార్డు సృష్టించింది. సినిమా పరిశ్రమకు చెందిన వారు ట్విటర్‌ ద్వారా ‘రాధేశ్యామ్‌’ చిత్రయూనిట్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలపడంతో #RadheShyam హాష్‌ట్యాగ్‌ హవా కొనసాగింది. 
 
 ‘రాధేశ్యామ్‌’ సినిమాను ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకానుంది. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా పూజాహెగ్డే నటిస్తోంది.