Asianet News TeluguAsianet News Telugu

ప్రేరణతో రెస్టారెంట్ లో ప్రభాస్...ఆసక్తి రేపుతున్న పూజ హెగ్డే లుక్

ప్రేరణగా పూజ లుక్ అద్భుతంగా ఉంది. వెస్ట్రన్ ట్రెడిషనల్ వేర్ ధరించిన పూజ తలకు స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు. 60ల కాలం నాటి యూరప్ కల్చర్ ఆమెలో కనిపిస్తుంది. ఆమె గెటప్ రీత్యా పూజా రోల్ చాలా సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ అయ్యే అవకాశం కలదు.  

radhe shyam introduces pooja hegde as prerana ksr
Author
Hyderabad, First Published Oct 13, 2020, 11:03 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బ్యూటీ పూజ హెగ్డే పుట్టినరోజు సంధర్భంగా రాధే శ్యామ్ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు . పోస్టర్ పై హ్యాపీ బర్త్ డే ప్రేరణ అని ఉన్న నేపథ్యంలో రాధే శ్యామ్ మూవీలో అది పూజ హెగ్డే పాత్ర పేరు అని తెలుస్తుంది. ప్రేరణగా పూజ లుక్ అద్భుతంగా ఉంది. వెస్ట్రన్ ట్రెడిషనల్ వేర్ ధరించిన పూజ తలకు స్కార్ఫ్ కూడా కట్టుకున్నారు. 60ల కాలం నాటి యూరప్ కల్చర్ ఆమెలో కనిపిస్తుంది. ఆమె గెటప్ రీత్యా పూజా రోల్ చాలా సాఫ్ట్ అండ్ సెన్సిబుల్ అయ్యే అవకాశం కలదు. 

ఓ విదేశీ రెస్టారెంట్ లో ప్రభాస్ ఎదురుగా కూర్చున్న పూజా నవ్వులు చిందిస్తుంది. మొత్తంగా పూజ లుక్ చాలా భిన్నంగా ఆకట్టుకొనేలా ఉంది ఇక 1960ల కాలంనాటి ప్రేమ కథగా రాధే శ్యామ్ తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియజేశారు. సినిమా ప్రధాన భాగం ఇటలీలో సాగుతుందని సమాచారం. రాధే శ్యామ్ మూవీలో ప్రభాస్ మరియు పూజ పాత్రలు చాలా ఎమోషనల్ అని వినికిడి. 

50శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న రాధే శ్యామ్ వచ్చే ఏడాది విడుదల కానుంది. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ నుండి మూవీ వచ్చి ఏడాది దాటిపోగా ఆయన అభిమానులు ఆసక్తికా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కాగా ఆ రోజు రాధే శ్యామ్ టీజర్ విడుదల చేస్తారని ప్రచారం సాగుతుంది. అలాగే ప్రభాస్ 21 మరియు ఆదిపురుష్ నుండి అప్డేట్స్ రానున్నాయని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios