‘సాహో’ తర్వాత ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా రాధేశ్యామ్ టైటిల్ తో రూపొందుతోంది. ఈ వారంలోనే షూటింగ్ పునః ప్రారంభం కాబోతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం గురించిన ఆసక్తికరమైన విషయాలు బయిచటకు వచ్చింది.

‘రాధే శ్యామ్’ సినిమాలో తమిళ్ యంగ్ హీరో అథర్వా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని.. అథర్వా, ప్రభాస్ కి తమ్ముడి పాత్రలో కనిపిస్తాడని తాజా సమాచారం.  ఈ పాత్ర సినిమాకు కీలకమైనది అని  చెప్తున్నారు. వరుణ్ తేజ్ చేసిన గద్దలకొండ గణేష్ సినిమాతో అధర్వ తెలుగువారికి పరిచయం అయ్యిన సంగతి తెలిసిందే. 

దర్శకుడు మాట్లాడితే.. ‘‘ప్రభాస్‌తో సినిమా చేయడం నా కల. ఆయనతో పనిచేస్తుండడం ఎంతో సంతృప్తినిస్తోంది. ప్రభాస్‌ కనిపించే విధానం సినిమాకి ప్రధాన బలం. వచ్చే ఏడాది చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరోయిన్ గా మా ఫస్ట్ ఛాయిస్ పూజాహెగ్డేనే. సరైన సమయంలోనే, అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తూ ట్రైలర్, టీజర్ విడుదల చేస్తాం’’ అని ట్వీట్‌ చేశారు రాధాకృష్ణ కుమార్‌. 

ఇటలీ నేపథ్యంగా సాగే ఓ నిర్దేశిత కాలానికి సంబంధించిన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమ కథకు ఇటలీలోని ఈ వెనిజో, రోమాలే కీలకమని తెలుస్తోంది.    ఈ చిత్రం కోసం త్వరలోనే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో వెనీజో టౌన్‌, రోమా ప్రాంతాలకు సంబంధించిన కొన్ని కీలక సెట్లను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ రెడ్డి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 

ప్రస్తుతం ఆయన సారథ్యంలోనే హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీ ఆస్పత్రి సెట్‌ను సిద్ధం చేసారు. అలనాటి బాలీవుడ్‌ అందాల తార భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2021 వేసవిలో ఈ చిత్రం విడుదల కానుంది.  గోపీకృష్ణ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా  జగపతిబాబు నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై చిత్ర టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది.