బహు భాషా నటుడు ఆర్‌ మాధవన్‌ సినిమాలతో పాటు సామాజిక అంశాల విషయంలో కూడా ముందే ఉంటాడు. ఇటీవల ఎక్కువగా పర్ఫామెన్స్‌ ఓరియంటెడ్‌, సందేశాత్మక చిత్రాలు మాత్రమే చేస్తున్న ఈ సీనియర్ హీరోగా విద్యార్దుల్లో ధైర్యం నింపేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవల బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన తరువాత చాలా మంది విద్యార్దులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు వినిపించాయి. అయితే తాజాగా డిప్రెషన్‌లో ఉన్న విద్యార్దుల కోసం ఓ ట్వీట్ చేశాడు మాధవన్‌.

బుధవారం బోర్డ్‌ ఎగ్జామ్స్‌ రిజల్ట్స్‌ గురించి ఓ ట్వీట్ చేశాడు మాధవన్‌. `బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన ప్రతీ ఒక్కరి కోసం, ` తమ అంచనాలను మించి స్కోర్‌ చేసిన వారికి అభినందనలు. మిగతా వారికోసం, నేను చెప్పేది ఏంటంటే నాకు బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో కేవలం 58% మార్కులు మాత్రమే వచ్చాయి. మిత్రులారా ఇంకా ఆట అసలు మొదలే కాలేదు` అంటూ ట్వీట్ చేశాడు.

చాలా మంది మీ మార్కులే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయని భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అది కరెక్ట్ కాదు. మీ డెడికేషన్‌, కమిట్‌మెంట్‌, హార్డ్‌ వర్క్‌ కూడా మీ భవిష్యత్తు ఉన్నతంగా ఉండేందుకు సాయపడతాయి అంటూ తనదైన స్టైల్‌లో సందేశాన్ని ఇచ్చాడు మాధవన్‌. విద్యార్దుల్లో మనో ధైర్యం నింపేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న మాధవన్‌పై అభినందనలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్‌. `మాడీ నువ్వు మాకు ఇన్సిపిరేషన్‌` అంటూ కామెంట్లు చేస్తున్నారు.