Asianet News TeluguAsianet News Telugu

పిల్లలకే కాదు ‘పుష్ప’ టీమ్‌ కీ ఆన్ లైన్ క్లాస్ లే!

ఈ సినిమాలో దాదాపు అందరూ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడనున్నారు. దాంతో ఓ డిక్షన్ కోచ్ ని సుకుమార్ అపాయింట్ చేసారు. అలాగే రష్మిక మందన్న పూర్తి మాస్ లాంగ్వేజ్ తో కనిపించేందుకు కుస్తీ పడుతుంది. చిత్తూరు యాసకు సంబందించిన కొన్ని ఆడియో టేపులు కూడా ఆమెకు సుకుమార్ పంపించి, భాషపై పట్టు సాధించాలని కోరినట్లు సమాచారం. అయితే కరోనా ప్రభావంతో షూటింగ్ మరింత లేటు అవుతోంది. ఈ సమయం వృధా అవటం ఎందుకని సుకుమార్ ఇప్పుడు ఆన్ లైన్ క్లాస్ లు ఎరేంజ్ చేసారట.

PUSHPA TEAM join FOR ONLINE CLASSES
Author
Hyderabad, First Published Sep 16, 2020, 9:14 AM IST

‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘పుష్ప’. శేషాచలనం అడవుల నేపధ్యంలో జరిగే కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. రష్మిక ఈ చిత్రంలో  హీరోయిన్ గా నటించబోతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నారట. 

ఈ సినిమాలో దాదాపు అందరూ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడనున్నారు. దాంతో ఓ డిక్షన్ కోచ్ ని సుకుమార్ అపాయింట్ చేసారు. అలాగే రష్మిక మందన్న పూర్తి మాస్ లాంగ్వేజ్ తో కనిపించేందుకు కుస్తీ పడుతుంది. చిత్తూరు యాసకు సంబందించిన కొన్ని ఆడియో టేపులు కూడా ఆమెకు సుకుమార్ పంపించి, భాషపై పట్టు సాధించాలని కోరినట్లు సమాచారం. అయితే కరోనా ప్రభావంతో షూటింగ్ మరింత లేటు అవుతోంది. ఈ సమయం వృధా అవటం ఎందుకని సుకుమార్ ఇప్పుడు ఆన్ లైన్ క్లాస్ లు ఎరేంజ్ చేసారట.

దీంతో చిత్తూరు యాసను పక్కాగా నేర్చుకోవడానికి పుష్ప టీమ్ కు మంచి సమయం దొరికినట్లయింది. అలాగే ‘పుష్ప’ టీమ్‌ అంతా ఈ సమయాన్ని ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌కు బాగా వినియోగించుకుంటోందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ప్రకాశ్‌రాజ్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, వెన్నెల కిశోర్‌, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఈ సినిమా కోసం బన్నీ, కథానాయిక రష్మిక చిత్తూరు యాస నేర్చుకున్నారు కూడా.

Follow Us:
Download App:
  • android
  • ios