ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ..ఈ మధ్యన అంటే కాస్త వెనకబడ్డాడు కానీ ఒకప్పుడు వరస హిట్స్ తో దూసుకుపోయాడు. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకు వచ్చిన ఆయన ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం రిలీజ్ అయ్యే ఈ సినిమా ప్యాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ కానుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే పూరి మరొకటి లైన్ లో పెట్టేసాడు. 

అందుతున్న సమాచారం మేరకు పూరి నెక్ట్స్ పట్టాలు ఎక్కించబోయేది ఓ బాలీవుడ్ ప్రాజెక్టు. ఇప్పటికే తాను రాసిన ఓ స్క్రిప్టుని ఓ యంగ్ హీరోకు వినిపించి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో షాహిద్ కపూర్ కావచ్చు అంటున్నారు. అయితే ఆ విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఓ హిందీ ప్రాజెక్టు అదీ ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించటానికి ఎగ్రిమెంట్ జరుగుతోందిట. లాక్ డౌన్ పూర్తికాగానే ఎనౌన్సమెంట్ రానుందిట. ఇప్పటికే ఆ ప్రాజెక్టు నిమిత్తం పూరికి అడ్వాన్స్  కూడా వచ్చిందిట. 

అలాగని పూరికి ఇదేమి మొదట హిందీ సినిమా కాదు. గతంలో అమితాబ్ తో ఓ సినిమా చేసారు. అలాగే మరిన్ని సినిమాలు సైతం ఎటెమ్ట్ చేసారు. ఆయన డైరక్ట్ చేసిన తెలుగు సినిమాలన్నీ హిందీలో డబ్బింగ్ అయ్యి..యూట్యూబ్ లోనూ, టీవి ఛానెల్స్ లోనూ బాగా ప్రేక్షకాదరణ పొందాయి. ఆయనంటే యంగ్ హిందీ హీరోల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఛార్మి రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై చిన్న లీక్ ఇచ్చింది. పూరి జగన్నాథ్ రాసిన బెస్ట్ స్క్రిప్టులలో అది ఒకటి అని చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండ కలిసి ఓ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ చేస్తున్నారు. బాక్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే ఈ ప్యాన్‌ ఇండియా సినిమాకు ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.  ముంబై – ఫారిన్‌ నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలిసింది. బ్యాక్‌ డ్రాప్‌లో కొంత ఫారిన్‌ కాబట్టి అక్కడ షూటింగ్‌ తప్పనిసరి అట. అంతా చక్కబడే వరకు ఓ నిర్ణయానికి రాలేమని చిత్ర టీమ్ నుంచి సమాచారం.