Asianet News TeluguAsianet News Telugu

సీన్ లోకి పూరి.. మొత్తం సెట్ అయ్యినట్లేనా!

ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సినిమా థియోటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. పోనీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో రారో తెలియదు. 

Puri Jagan behind Nishabdham OTT release?
Author
Hyderabad, First Published Jun 3, 2020, 12:19 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సినిమా వాళ్లకు తాము నమ్మే కొందరి వ్యక్తుల ఆలోచనలపై విపరీతమైన నమ్మకం ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్లను సలహా అడుగుతూంటారు. వేరే ఆలోచన లేకుండా ఆ సూచనలను ఫాలో అయ్యిపోతూంటారు. ఇప్పుడు అనుష్క కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’ రిలీజ్ గురించి ఓ ప్రముఖ దర్శకుడు ఆలోచనని తీసుకున్నట్లు తెలుస్తోంది.   ఓ సరికొత్త సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ‘నిశ్శబ్దం’లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్దితుల్లో సినిమా థియోటర్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో క్లారిటీ లేదు. పోనీ ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చి ఓపెన్ చేసినా జనం ధైర్యం చేసి వస్తారో రారో తెలియదు. 

ఇంత సందిగ్ధ స్దితిలో ఏం చెయ్యాలి..ఎలా ముందుకు వెళ్లాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపధ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ని సంప్రదించినట్లు సమాచారం.  కోన వెంకట్ ని ఈ విషయమై ఒప్పించినట్లుగా చెప్తున్నారు. అలాగే ఈ సినిమా కాపీని చూసి ,కొన్ని సజెషన్స్ చెప్పి, ఎడిటింగ్ చేయించినట్లు వినపడుతోంది. మంచి ఎమౌంట్ వస్తున్నప్పుడు ఇప్పుడున్న సందిగ్ధ పరిస్దితుల్లో ఓటీటి లో రిలీజ్ చేయటమే ఉత్తమమని చెప్పినట్లు సమాచారం. దాంతో పూరి మాటలపై నమ్మకంతో ఓటీటికు ఇవ్వటానికి నిశ్శబ్దం టీమ్ అవుతున్నట్లుగా మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. అయితే ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
 
హారర్‌ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి... హేమంత్‌ మధుకర్‌ దర్శకుడు.  పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్ని పనులు పూర్తి చేసిన  ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఏప్రియల్ 2 వ తేదీన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు.  కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లకు తాళం పడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్‌ పొడగింపు, ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో దర్శక, నిర్మాతలు ఈ సినిమాని ఓటీటికు ఇచ్చేద్దామనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న 'నిశ్శబ్దం'లో అనుష్క దివ్యాంగురాలిగా కనిపించబోతున్నట్లు సమాచారం.   మాధవన్ ఈ సినిమాలో ‘ఆంథొనీ’ అనే సెలెబ్రిటీ మ్యుజిషియన్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాలోని కీ సీన్స్ ను అమెరికాలోని సీటెల్‌లో షూట్ చేసారు. ఈ సినిమా  పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా యునైటెడ్ స్టేట్స్ లోనే జ‌ర‌గింది. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

అనుష్క శెట్టి, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో మెయిన్ రోల్స్ పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – గోపీ సుంద‌ర్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, ఆర్ట్ – చాడ్ రాప్టోర్, స్టైలీష్ట్ – నీర‌జ కోన‌, స్టంట్స్ – ఆలెక్స్ టెర్జీఫ్, సినిమాటోగ్ర‌ఫీ – షానియ‌ల్ డియో, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ – కోన వెంక‌ట్, స్టోరీ & డైరెక్ష‌న్ – హేమంత్ మ‌ధుక‌ర్;సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల; నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్

Follow Us:
Download App:
  • android
  • ios