టాలీవుడ్ నటీమణులతో బలవంతపు సెక్స్.. ఆ నిర్మాతే కారణం!

Prostitution racket discovered in US, telugu film producer arrested
Highlights

అమెరికాలోకి షికాగోలో నివసిస్తున్న తెలుగు ఫ్యామిలీ టాలీవుడ్ కు చెందిన తారలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ హై లెవెల్ లో వ్యవహారాన్ని నడిపించారు

అమెరికాలోకి షికాగోలో నివసిస్తున్న తెలుగు ఫ్యామిలీ టాలీవుడ్ కు చెందిన తారలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ హై లెవెల్ లో వ్యవహారాన్ని నడిపించారు. ఇప్పుడు ఆ విషయం బయట పడడంతో వారిని ఫెడరల్ ఏజెన్సీలు అరెస్ట్ చేశాయి. అసలు విషయంలోకి వస్తే కిషన్ మోదుగుముడి(34) అనే వ్యాపారవేత్త టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. షికాగోలో తన భార్య, పిల్లలతో కలిసి జీవించే కిషన్ టాలీవుడ్ కు సంబంధించిన కొందరు నటీమణులను టెంపరరీ వీసాల మీద అమెరికా తీసుకువచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.

ఓ యంగ్ హీరోయిన్ ను ఓ షో పాల్గొనాలని చెప్పి అమెరికాకు రప్పించాడు కిషన్. ఆమెతో కూడా బలవంతంగా సెక్స్ చేయించే ప్రయత్నం చేశాడు. ఈ వ్యవహారాన్ని బయటకు చెబితే.. తన అంతు చూస్తానని హెచ్చరించారట. ఈ విషయం గనుక పోలీసులకు చెబితే.. నీ సంగతి చూడడం మాకు పెద్ద విషయం కాదని, నీ గురించి పెద్ద ఎవరికీ తెలియదు నువ్ పెద్ద నాటివి కూడా కాదని బెదిరించాడట. ఈ క్రమంలో తనకు ఎలాంటి హానీ కలిగించవద్దని బాధితురాలు రాసిన మెయిల్ ద్వారా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు నలుగురు నటీమణులను బలవంతగా అపార్ట్మెంట్ లో పెట్టి వ్యభిచారం నిర్వహించారట. 

ఒక్కో క్లయింట్ నుండి మూడు వేల డాలర్ల వరకు వసూలు చేసేవారని పోలీసులు రికార్డుల్లో నమోదు చేశారు. కిషన్ ఈ విధంగా తారలను టార్గెట్ చేస్తుంటే.. అతడి భార్య డబ్బు వ్యవహారాలు చూసుకునేదని తెలుస్తోంది. ఎవరెవరు ఎన్నెన్నిసార్లు పాల్గోన్నారు, డబ్బు ఎంత చేతులు మారిందనే విషయాలను ఆమె డీల్ చేసేదట. భార్యభర్తలిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరిపి మరిన్ని విషయాలు తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు. 

loader