టాలీవుడ్ లో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారింది నటి శ్రీరెడ్డి.  కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సెలబ్రిటీల మీద సంచలన ఆరోపణలు చేసిన ఈ నటి ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. సుందర్ సి, లారెన్స్ వంటి తారలు శారీరకంగా తనను ఉపయోగించుకున్నారంటూ ఆమె వారిపై అభియోగాలు మోపింది. నడిగర్ సంఘం ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దిశగా అడుగులు వేస్తోంది.

ఈక్రమంలో ఆమెపై వ్యభిచారం, డబ్బు దోపిడీ వంటి ఆరోపణలతో ఇండియన్ మక్కల్ మంద్రం(ఐఎంఎం) అనే సంస్థకు చెందిన సభ్యుడు సిటీ పోలీస్ కమీషనర్ కు కంప్లైంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీరెడ్డి చేస్తోన్న పనులు భారతీయ సమాజాన్ని, సంస్కృతిని అవమానించే విధంగా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సినిమా అవకాశాల కోసం ఆమె దర్శకులు, నటుల వద్ద పడుకున్నట్లు స్వయంగా అంగీకరిస్తుంది ఇలా చేయడం వ్యభిచారం కిందకే వస్తుందని ఐఎంఎం సభ్యుడు తెలిపాడు.

ఆమె మాటల్లోనే తను తప్పుడు పనులు చేస్తుందని తెలుస్తున్నప్పుడు ఆమెపై కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మరి ఈ కేసుని చెన్నై పోలీసులు ఎలా పరిష్కరిస్తారో చూడాలి!