డ్రగ్స్ ఆరోపణలపై అరెస్టైన హీరోయిన్ సంజనా గల్రాని ఆస్తులు కోట్లలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమెకు కోట్ల విలువ చేసే ఆస్తులు, భారీ నగదు కూడబెట్టిన అధికారులు గుర్తించారు. సంజన గల్రాని కెరీర్ లో అనేక సినిమాలలో నటించినప్పటికీ ఆమెకు హీరోయిన్ గా సరైన గుర్తింపు రాలేదు. సంజన కనీసం ఒక స్థాయి హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకోలేదు. స్టార్ హీరోయిన్ కాదు కదా, కనీసం టూ టైర్ హీరోయిన్ గా కూడా సంజన గుర్తింపు తెచ్చుకోలేదు. అలాంటిది ఓ స్టార్ హీరోయిన్ కి మించిన సంపాదన, ఆస్తులు ఆమె దగ్గర ఉన్నట్లు ఆధారాలు లభించాయి. 

డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయినప్పటికీ డ్రగ్స్ తీసుకున్నట్లు గాని, డ్రగ్స్ కొనడం, అమ్మడం వంటివి చేసినట్లు అధికారులకు ఆధారాలు లభించలేదు. ఆమె కాల్ డేటా పరిశీలనలో కూడా ఎక్కడా డ్రగ్స్ గురించి లావాదేవీలు జరిపిన వివరాలు దొరకలేదు. సంజన గల్రాని ఇంటిలో జరిపిన సోదాలలో ఎటువంటి డ్రగ్స్ లభ్యం కాలేదు. డ్రగ్స్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ప్రకాష్ రాంకా ఇచ్చిన సమాచారం మేరకే సంజనాను అరెస్ట్ చేయడం జరిగింది. 

ప్రకాష్ రాంకాతో కలిసి బెంగుళూరు, గోవా, శ్రీలంక, ముంబైలలో పార్టీలలో సంజన పాల్గొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సంజనా తోపాటు అరెస్టైన మరో హీరోయిన్ రాగిణి ద్వివేది పరప్పణ అగ్రహారం జైలులో ఉన్నారు. వీరిని కోర్ట్ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడం జరిగింది. జైల్లో సంజన మరియు రాగిణి ఒకే గదిలో ఉంచారని సమాచారం. వీరు తమతో తెచ్చుకున్న పుస్తకాలను చదువుతూ సమయాన్ని గడుపుతున్నారట.