Asianet News TeluguAsianet News Telugu

జగన్,వైసీపీ నేతల ఒత్తిడి మాపై లేదు: సురేష్ బాబు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ మీద ఒత్తిడి పెట్టడం లేదని, అదంతా మీడియా సృష్టి అని మాత్రం తేల్చారు. ముఖ్యమంత్రి జగన్‌ గానీ, వైసీపీ నేతలు గానీ తమపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చారు

Producer Suresh Babu Gives Clarity On Vizag studio issue jsp
Author
Hyderabad, First Published Jul 19, 2021, 10:10 AM IST

గత కొద్ది రోజులుగా మీడియాలో సురేష్ బాబు వైజాగ్ స్టూడియోని ఏపి ప్రభుత్వం స్వాదీనం చేసుకోబోతోందంటూ..ఆ మేరకు ఒత్తిడి వస్తోదంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వార్తలపై రామానాయుడు పెద్దకుమారుడు సురేష్‌బాబు తాజాగా స్పందించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ నెల 20వ తేదీన ‘నారప్ప’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలోనే సురేష్‌బాబు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విశాఖ రామానాయుడు స్టుడియో వివాదంపై ఆయన స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారుస్తున్నారు. ప్రభుత్వ పాలన ఇక అక్కడినుంచి సాగుతుంది. అందుకే, మంచి లొకేషన్ లో ఉన్న రామానాయుడు స్టూడియోని తీసుకొని అక్కడ సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు మొదలయ్యాయి. అయితే ఆ మీడియా కథనాలును సురేష్ బాబు ఖండించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ మీద ఒత్తిడి పెట్టడం లేదని, అదంతా మీడియా సృష్టి అని మాత్రం తేల్చారు. ముఖ్యమంత్రి జగన్‌ గానీ, వైసీపీ నేతలు గానీ తమపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని క్లారిటీ ఇచ్చారు.

“వైజాగ్ లోని రామానాయుడు ఫిలిం స్టూడియో మా సొంతం. అందులో ప్రభుత్వ సొమ్ము లేదు. ప్రభుత్వ వాటా లేదు. మీడియా వార్తలు నమ్మకండి.” నిర్మాత సురేష్ బాబు చెప్పారు.అయితే, ప్రభుత్వం అడిగితే ఇస్తారా అంటే… ఇది పర్సనల్ మేటర్ అని సమాధానమిచ్చారు. ఆ భూములను మార్కెట్‌ ధరకన్నా ఎక్కువే చెల్లించి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వం ఏ భూమినైనా సేకరించవచ్చని, కానీ దానికి తగిన పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. తాము భవిష్యత్తులోనూ విశాఖలో స్టూడియో నిర్వహిస్తామని సురేష్‌బాబు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios