తీసింది తక్కువ సినిమాలే అయినా అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు కే ఎల్ నారాయణ గారు. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం అనే నారాయణ హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు, సంతోషం, క్షణక్షణం, రాఖీ వంటి అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. నేడు కే ఎల్ నారాయణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కెరీర్ మరియు భవిష్యత్ చిత్రాలు గురించి చెప్పారు. కాగా నారాయణ ఓ రేర్ కాంబినేషన్ కి నిర్మాతగా వ్యవహరించనున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మూవీ నిర్మాత కె ఎల్ నారాయణ కావడం విశేషం. 

మహేష్, రాజమౌళి మూవీ చేయాలనీ ఫ్యాన్స్ మరియు సినీఅభిమానులు కోరుకుంటున్నారు. చాలా కాలం తరువాత ఈ కాంబినేషన్ సాకారం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు రాజమౌళి స్పష్టత ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ తరువాత చేసేది మహేష్ తోనే అని ఆయన కన్ఫర్మ్ చేశారు. ఈ ఏడాదిలో మహేష్ ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చిన న్యూస్ ఇదని చెప్పాలి. 

ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళికి నిర్మాత కే ఎల్ నారాయణ ఎప్పుడో అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఐతే అనేక కారణాల చేత మహేష్ తో రాజమౌళి మూవీ కార్యరూపం దాల్చలేదు. ఆర్ ఆర్ ఆర్ కి ముందే మహేష్ తో రాజమౌళి మూవీ చేయాల్సింది. ఇక నిర్మాత కే ఎల్ నారాయణ బర్త్ డే సంధర్భంగా మీడియాతో ఆయన అనేక విషయాలు పంచుకున్నారు. అలాగే మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మహేష్, రాజమౌళి తమ ప్రస్తుత ప్రాజెక్ట్స్ పూర్తి అయిన వెంటనే మూవీ చేద్దాం అన్నారట.