బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షుల కపూర్ ని పొగడ్తలతో ముంచేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె కేరింగ్ నేచర్ మరియు ఇంటిని మేనేజ్ చేయడం వంటి విషయాలలో భేష్ అంటూ పొగిడేస్తున్నారు. హీరో అర్జున్ కపూర్ కొద్దిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని అర్జున్ కపూర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. దీనితో హోమ్ కొరెంటైన్ అయిన అర్జున్ కపూర్ ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు . 

కోవిడ్ బారిన పడిన అర్జున్ కపూర్ ఆరోగ్యం విషయంలో అన్షులా కపూర్ ఎంతో కేరింగ్ గా ఉంటున్నారట. తగు జాగ్రత్త మధ్య అన్న అర్జున్ కి సేవలు చేస్తున్నారట. అలాగే విపత్కర పరిస్థితులలో కుటుంబాన్ని కూడా సమర్థవంతంగా చక్కబెడుతుంది అన్నారు. అలాగే తను నడుపుతున్న సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫ్యాన్ కైండ్ ని నిరాటంకంగా నడుపుతున్నారట. ఈ విషయాలన్నీ తన ట్వీట్ లో ప్రస్తావిస్తూ కూతురు అన్షులా కపూర్ ని చూసి గర్వపడుతున్నట్లు చెప్పారు. 

అలాగే జాన్వీ కపూర్ స్వయంగా వేసిన కొన్ని పెయింటింగ్స్ ని కూడా బోణి కపూర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు . 1983లో బోనీ కపూర్ మోనా శౌరి కపూర్ ని వివాహం చేసుకోగా వీరికి అర్జున్ కపూర్, అన్షులా కపూర్ జన్మించారు. 1996లో ఈమెకు విడాకులు ఇచ్చిన బోనీ కపూర్ అదే ఏడాది శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరుఅమ్మాయిలు. శ్రీదేవి 2018లో ప్రమాదవశాత్తు చనిపోయిన సంగతి తెలిసిందే.