Asianet News TeluguAsianet News Telugu

దానికన్నా సెక్స్ చేయటమే ఎక్కువ ఇష్టం

  • హాలీవుడ్ ఎంట్రీ తర్వాత యాటిట్యూడ్ పుల్ గా మార్చేసిన ప్రియాంక
  • పొగ తాగొద్దని చెప్పటానికి తనదైన శైలిలో స్పందించిన ప్రియాంక
  • ఒక సిగరెట్ తాగటం కంటే..దాని బదలు సెక్స్ చేయడం మేలంటోంది
priyanka chopra like to have sex rather smoking

బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా వాల్డ్ వైడ్ పబ్లిసిటీ దక్కటంతో... తెగ రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తనదైన శైలిలో కమెంట్స్ పోస్ట్ చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల మోడీ పక్కన కూర్చుని తొడలు చూపించావేంటి? అని నెటిజన్లు అడిగితే, తన తొడలు మాత్రమే గాక తన తల్లి తొడలు చూపిస్తూ ఫొటోను పోస్టు చేసి ధీటుగా జవాబిచ్చింది. తొడలు కూడా శరీర భాగాలే.. అంతకు మించి ఆలోచించొద్దు అంటూ ఘాటైన కౌంటర్ ఇచ్చింది ప్రియాంక.

 

హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బికినీ పోజులు, బీచ్ వెకేషన్లతో ఇండియన్స్ నోళ్లలో నీళ్లను ఊరిస్తున్న ప్రియాంక.. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సిగరెట్ స్మోకింగ్ ను వ్యతిరేకించిన ప్రియాంక.. ఆ విషయాన్ని చాలా సెక్సీ గా చెప్పింది. సిగరెట్ తాగడం కన్నా సెక్స్ ఎంజాయ్ మెంటే బెటర్ అంటోంది ప్రియాంక. తనకు సిగరెట్ అంటే అసహ్యం అని, సిగరెట్ - సెక్స్ లలో దేనికి ప్రాధాన్యతను ఇస్తావని అని అడిగితే.. తను సెక్స్ నే ఎంచుకుంటాను అని ప్రియాంక చాలా సెక్సీగా చెప్పింది.

 

ఒక సిగరెట్ తాగడం కన్నా ఒక సారి సెక్స్ ను ఆస్వాదించడమే మేలని ప్రియాంక తేల్చి చెప్పింది. మరి ఈ అందాల భామ కామెంట్ ను సిగరెట్ తాగే జనాలు గమనించుకోవాలి. సిగరెట్ తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు.. సెక్స్ తో అంతకు మించిన ఆనందం ఉంటుంది.. అని భరోసా ఇస్తోంది ప్రియాంక. పొగ మాన్పించడానికి ఇంతకు మించిన చిట్కా ఇప్పటిదాకా మరెవరూ ఇవ్వలేదు కదా..

Follow Us:
Download App:
  • android
  • ios