బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకొని హాలీవుడ్ బాట పట్టిన అందాల భామ ప్రియాంక చోప్రా. అంతర్జాతీయ పాప్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌ను పెళ్లాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం విదేశాల్లోనే సెటిల్ అయ్యింది. లాక్‌ డౌన్‌ టైంలో ఎక్కువగా ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. తన పర్సనల్‌ విశేషాలతో పాటు పెట్స్‌, ట్రిప్స్‌ లాంటి అన్ని విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది పీసీ.

తాజాగా ఈ బ్యూటీ మరో ఇంట్రస్టింగ్ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్  చేసింది. ప్రియాంక ఎలాంటి లుక్‌, డ్రెస్‌ అయినా ఈజీగా క్యారీ చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. శనివారం ఉదయం పీసీ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. న్యూ హెయిర్‌ కట్‌తో ప్రియాంక చాలా అందంగా ఉంది. బ్లూ కలర్‌ షర్ట్‌లో ఎక్స్‌ట్రీమ్ క్లోజ్‌గా ప్రియాంక లుక్‌ వావ్‌ అనిపించేలా ఉంది. ఈ ఫోటోతో పాటు ప్రియాంక `న్యూ హెయిర్‌, డోంట్‌ కేర్‌` అంటూ కామెంట్ చేసింది.

ఈ ఫోటోకు అభిమానులతో పాటు సెలబ్రిటీల నుంచి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. క్రేజీలీ గార్జియస్, లవ్‌ ద హెయిర్‌, జస్ట్ స్టన్నింగ్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌. ప్రస్తుతం లాస్‌ ఏంజిల్స్‌లో ఉంటున్న ఈ బ్యూటీ తన ప్రతీ అప్‌డేట్‌ను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. లాక్‌ డౌన్‌ సమయంలో వరుసగా తన గ్లామరస్‌ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది ప్రియాంక.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

New hair, don’t care.

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Sep 11, 2020 at 5:29pm PDT