Asianet News TeluguAsianet News Telugu

సెక్స్ చేయాలని దర్శక నిర్మాతలు నన్నూ పిలిచారు-ప్రియాంకాచోప్రా

  • హాలీవుడ్ లో సత్తా చాటిన ప్రియాంక చోప్రా
  • తన కెరీర్ తొలి నాళ్లలో సెక్స్ కోసం దర్శ నిర్మాతలు అడిగారంటున్న ప్రియాంక
  • అది కేవలం సుఖం కోసం కాక మహిళలపై ఆధిపత్యం కోసమే అంటున్న ప్రియాంక
priyanka chopra being invited to give pleasure

ఇటీవల కాలంలో హిరోయిన్లు తమకు కెరీర్లో ఎదుగుదల కోసం దర్శక నిర్మాతల నుంచి ఎదురయ్యే సెక్సువల్ హరాస్ మెంట్ గురించి బాగానే మాట్లాడుతున్నారు. ఈ మధ్య హాలీవుడ్ లో కూడా ఈ తంతు బాగా కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత హార్వే వీన్ స్టెయిన్ ఓ అగ్ర నటిని సెక్స్ చేయాలని కోరినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

 

దాదాపు 30 మందికి పైగా నటీమణులు అతనిపై సెక్సువల్ హరాస్ మెంట్ ఆరోపణలు చేశారు. ఇవన్నీ ఎప్పుడో గతంలో జరిగినా... ఇటీవలే అందరూ దీనిపై మాట్లాడుతున్నారు. దీనిపై బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవలే.. ఓ టాక్ షోలో మాట్లాడింది.

 

ఇది హాలీవుడ్ లోనో, ఒక్క హార్వేతోనో తొలగిపోయే సమస్య కాదని.. ప్రతి సినీ పరిశ్రమలో ఇది కనిపిస్తుందని ప్రియాంక అంది. ఇది కేవలం ఏదో సెక్స్ చేసి ఆ మధురానుభూతిని ఆస్వాదించడానికే కాకుండా.. మగ వారి ఆధిపత్యానికి చిహ్నంగా అనిపిస్తుంటుందని ప్రియాంక అంది. స్ట్రీని కంట్రోల్ చేయడమే లక్ష్యంగా ఇది సాగుతోందని అంది. అంతే కాక కేవలం అడ్జస్ట్ అనవాళ్లే పరిశ్రమలో నిలదొక్కుకుంటారనే అపవాదు కూడా వుందని అభిప్రాయపడింది.

 

ఇలాంటి పరిస్థితిలో మార్పు రావాలని ప్రియాంక అంది. తను కూడా కెరీర్ తొలి నాళ్లలో ఇలాంటి ఆఫర్లు అందుకున్నానని, అయితే ఎవరికీ తలొంచలేదని ప్రియాంక స్పష్టం చేసింది. దీనిపై మహిళలంతా ఉద్యమించాల్సిన అవసరం వుందని ప్రియాంక అభిప్రాయ పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios