సాధారణంగా ప్రియమణి వివాదాలకు, రూమర్లకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. అయితే మీడియా అలా సైలెంట్ గా ఉంటే ఎలా ఊరుకుంటుంది. అవసరం అనుకుంటే పాతవి కూడా తవ్వి పోస్తుంది. వివరణ అడుగుతుంది. ఏదో విధంగా ప్రియమణిని వార్తల్లోకి తేవటానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది.  అప్పట్లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌ (సీసీఎల్)లో భాగంగా ఓ క్రికెటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడ్ని ప్రియమణి చెంపబెబ్బ కొట్టిందంటూ వార్తలు వచ్చాయి. వాటిని మళ్లీ సోషల్ మీడియా,మీడియా భుజాన ఎత్తుకుంది. ఈ క్రమంలో ప్రియమణి వివరణ ఇవ్వటం తప్ప వేరే ఆప్షన్ కనపడలేదు.

ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ.... "ఓ వ్య‌క్తి  మొబైల్ ఫోన్ దొంగిలించి నాతో ప్రాంక్ చేసాడు. ఆ తర్వాత ర‌క‌ర‌కాలుగా ఇబ్బంది పెట్టాడు. ఆ త‌ర్వాత ఫోన్ దొంగిలించిన వ్యక్తి స్వయంగా నా హోటల్ రూంకు వచ్చి కలిశాడు. అయితే అలా చేయటం నాకు ఇష్టం లేదని చెప్పాను. అతను నాతో బిహేవ్ చేసిన విధానం సరిగా లేదని చెప్పాను. ఆ సంఘటన ఓ చేదు అనుభవమే. అయితే ఆ క్రమంలో  తాను అతడిని కొట్టానని వచ్చిన వార్తల్లో మాత్రం నిజం లేదు" అని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది. 

అయితే ఆమెను అంతలా  ఇబ్బంది పెట్టిన ఆ క్రికెట‌ర్ పేరు ఏమిటి అన్న ప్ర‌శ్న‌కు మాత్రం ప్రియ‌మ‌ణి స‌మాధానం ఇవ్వ‌లేదు.  ప్రస్తుతం వెంకటేష్ నారప్ప సినిమాతో పాటు హిందీలో అజయ్ దేవ్‌గన్ మైదాన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ప్రియమణి. దాంతోపాటు టీవీ షోల్లో కూడా జడ్జిగా చేస్తోంది.