కొత్త పెళ్లి కొడుకు రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం విరాటపర్వం. నీది నాదీ ఒకే కథ ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సిన ఉన్నా లాక్‌ డౌన్‌ కారణంగా ఆలస్యమైంది. ఇటీవల ఈ సినిమాలో సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ను రివీల్ చేశారు. అప్పటి వరకు ఈ సినిమా నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతుందన్న ప్రచారం మాత్రమే ఉంది. సాయి పల్లవి లుక్‌తో కథా కథనాల మీద క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఈ సినిమాలోని మరో లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఈ సినిమాతో చాలా రోజుల తరువాత ప్రియమణి టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా విరాటపర్వం సినిమాలోని ప్రియమణి లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్. నక్సలైట్‌ డ్రెస్‌లో ఉన్న ప్రియమణి లుక్‌ సూపర్బ్ అనిపించేలా ఉంది. ఈ సినిమాలో ఆమె భారతక్క పాత్రలో కనిపించనుంది. ఈ లుక్‌తో పాటు సినిమా కథ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్.

ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను డి సురేష్‌ బాబు, చెరుకూరి సుధాకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్లు స్టీఫెన్‌ రిచర్డ్ పని చేస్తున్నాడు. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో #ViraataParvam లో 'కామ్రేడ్ భారతక్క' కూడా అంతే కీలకం` అంటూ ప్రియమణి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రివీల్ చేశాడు రానా.